బీసీసీఐ సంచలనం- టీమిండియా కేప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అపాయింట్..!!

ముంబై: క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. సుదీర్ఘమైన సిరీస్ ఇది. వచ్చేనెల 13వ తేదీ వరకు టీమిండియా అక్కడే ఉంటుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ నెల 12వ తేదీన తొలి టెస్ట్ ఆరంభమైంది కూడా. డొమినికాలోని రోసౌ స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతోంది.

మూడోరోజు సెషన్‌లో ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసింది భారత్. అయిదు వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసిన అనంతరం ఇన్నింగ్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్ ఆరంభించింది. ఓపెనర్లు టగెనారాయణ్ చందర్‌పాల్, క్రెయిగ్ బ్రేత్‌వైట్ ఆడుతున్నారు. టీమిండియా ఇన్నింగ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 171, కేప్టెన్ రోహిత్ శర్మ 103 చేశారు. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేశాడు.

Yashaswi Jaiswal

వెస్టిండీస్‌తో సిరీస్ తరువాత టీమిండియా.. ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. మూడు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. ఐర్లాండ్‌లోని మలహిడె క్రికెట్ క్లబ్ గ్రౌండ్.. ఈ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

దీని తరువాత భారత జట్టు ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుంది. చైనాలోని హౌంగ్ఝౌలో ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. ఇది టీ20 ఫార్మట్. ఇందులో మహిళలతో పాటు పురుషుల భారత క్రికెట్ జట్టు పాల్గొంటుంది. పురుషుల క్రికెట్ జట్టు ఆసియా గేమ్స్‌లో ఆడటానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై బీసీసీఐ ఇదివరకే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Rinku Singh

ఆసియా గేమ్స్‌లో పాల్గొనబోయే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును కొద్దిసేపటి కిందటే వెల్లడించింది. మరో అయిదుమంది ప్లేయర్లను కూడా స్టాండ్‌బైగా తీసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లతో కూడిన జట్టును ఆసియా గేమ్స్ కోసం ఎంపిక చేసింది బీసీసీఐ.

ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. హైదరాబాదీ స్టార్ బ్యాటర్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, వికెట్ కీపర్లు జితేష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్.. వంటి టీ20 స్పెషలిస్టులను జట్టులోకి తీసుకుంది.

Tilak Verma

ఆసియా గేమ్స్ ఆడే జట్టులో- రుతురాజ్ గైక్వాడ్ (కేప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ , అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్) ఉన్నారు. స్టాండ్‌బైగా- యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ సెలెక్ట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+