శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

50 మందికి అస్వస్థత: అచ్యుతాపురంలో మరోసారి గ్యాస్ లీక్

|
Google Oneindia TeluguNews

అచ్యుతాపురం బాండేక్స్ కంపెనీలో మరోసారి గ్యాస్ లీకయ్యింది. దీంతో అక్కడే పనిచేస్తున్న చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. విష వాయువు లీక్ కావడం వల్ల 50 మంది మహిళలు ఇబ్బంది పడ్డారు. వాంతులు, వికారంతో స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందజేశారు. మరోవైపు నిత్యం ప్రమాదలతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసి ఆసుపత్రి వద్దకు కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు.

 50 workers hospitalised after gas leak in company in Atchyutapuram

సదరు మహిళలు అంతా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు తెలిసింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఏపీపీసీబీ అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు పోలీసులు ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 6.15 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగిందని అంకపల్లె ఇన్ స్పెక్టర్ తెలిపారు. సెకండ్ షిప్టులో 1000 మంది ఉన్నారు. వారిలో 50 మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఘటనకు గల కారణం ఇంకా తెలియరాలేదు. కొందరు కార్మికులు సెజ్ మెడికల్ సెంటర్‌లో ప్రథమ చికిత్స చేశారు. మరికొందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురయిన కొంతమంది గర్భిణిలు ఉన్నారని పీటీఐ రిపోర్ట్ చేసింది. జూన్ 3వ తేదీన కూడా అక్కడే ప్రమాదం జరిగింది. 200 మంది మహిళలు వికారం, వాంతులు వచ్చి పడిపోయారు. ఇప్పుడు మరో ఘటన జరగడం భయాందోళన కలిగిస్తోంది.

English summary
50 women workers were rushed to hospital on Tuesday following a gas leak at an apparel manufacturing unit in the Brandix Special Economic Zone in Andhra Pradesh's Atchyutapuram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X