ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఇచ్ఛాపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నాయోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సోంపేట, కంచిలి మండలాలు పూర్తిగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కలి సాయి. టిడిపికి గట్టి పట్టు ఉన్న స్థానం ఇది. గతంలో టిడిపి నాయకుడిగా ఉన్న ఎంవి కృష్ణారావు ఇక్కడ నాలుగు సార్లు గె లుపొందారు. ఆ తర్వాత కాలంలో టిడిపి వర్గ రాజకీయాలక కారణంగా ఆయన కాంగ్రెస్ లో చేరారు. 1962,1972, 2009 లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2009 లో ప్రజారాజ్యం ఈ నియోజకవర్గంలో 30 వేలకు పైగా ఓట్లను సాధించింది. ఆ ఎన్నికల్లో సాఫ్ఠవేర్ రంగంలో ఉన్న సాయిరాజ్ టిడిపి నుండి గెలుపొందారు. జగన్ పార్టీ పెట్టిన కొత్తల్లో ప్రభుత్వం పై అవి శ్వాసానికి మద్దతుగా సాయిరాజ్ ఓటేసి అనర్హతకు గురయ్యారు. అయితే, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయలేదు.
14 సార్లు ఎన్నికలు టిడిపి అధిక్యత..
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 1952 నుండి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది. టిడిపి ఏడు సార్లు గెలుపొందింది. కెఎల్‌పి రెడు సార్లు, జనతా ఒకసారి, స్వతంత్ర అభ్యర్ధి ఒకసారి గెలిచారు. టిడిపి ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ కేవలం 2004 లో మాత్రమే విజయం సాధించింది. ఇక మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ టిడిపి గెలుస్తూ వచ్చింది. దీంతో..ఇక్కడ టిడిపి నుండి ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. 2014 లోనూ ఇక్కడి నుండి టిడిపి గెలిచింది.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇచ్ఛాపురం లో మొత్తం 224984 ఓట్లు ఉండగా, అందులో 160074 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుంటి పోటీ చేసిన ఆశోక్ కు 86815 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన రామారావు కు 61587 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ధి బి అశోక్ 25278 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక, వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ద్వారా ఈ జిల్లాలో పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. జగన్ పాదయాత్ర ఇదే నియోజకవర్గంలో ముగిసింది. జగన్ కు ఇక్కడ స్పందన బాగానే ఉన్నప్పటికీ టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎంత వరకు వైసిపి గెలుస్తుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications