ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాతపట్నం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పాతపట్నం, ఎల్ఎన్‌పేట మండలాలు పూర్తి పాతపట్నం నియోజకవర్గం లో చేరాయి. గతంలో నాగూరు, 2004 లో పార్వతీపురం లో గెలిచిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజు ఇక్కడి నుం డి 2009 ఎన్నికల్లో గెలిచి..2014 ఎన్నికల్లో ఓడిపోయారు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఏనాడు ఓటమి ఎరుగని శత్రు చర్ల కు ఇక్కడ ఓటమి తప్పలేదు. 1996 లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి నుండి పోటీ చేసి గెలి చారు. కలమట వెంకట రమణమూర్తి 2009 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసి..2014 ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసారు . 2009 ఎన్నికల్లో ఇక్కడి ప్రజారాజ్యం సైతం ప్రభావం చూపించింది. ఇక్కడి నుండి ఒకసారి స్వతంత్ర అభ్యర్ధి గా గెలిచిన కె మోహనరావు ఆ తరువాత టిడిపి నుండి నాలుగు సార్లు గెలిచారు.
15 సార్లు ఎన్నికలు..
పాతపట్నం నియోజకవర్గానికి 1952 నుండి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఏడు సార్లు కాంగ్రెస్ గెలిచింది.ఆరు సార్లు టిడిపి గెలిచింది. ఒక సారి స్వతంత్ర అభ్యర్ధి..2014 ఎన్నికల్లో వైసిపి గెలిచింది. 2009 ఎన్నికల్లో ఇక్క డ నుండి గెలిచిన శత్రుచర్ల విజయరామ రాజు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసారు. లోక్‌సభ సభ్యుడిగా నూ మూడు విడతలు గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన తరువాత తన మేనల్లుడు తో కలిసి కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరారు. అందులో భాగంగా 2014 ఎన్నికల్లో టిడిపి నుండి ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసారు.

2014 లో వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 198782 ఓట్లు ఉండగా.. అందులో 140040 ఓట్లు పోల య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన కలపల వెంకట రమణ కు 69320 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన శత్రుచర్ల విజయరామ రాజుకు 65455 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి వెంకటరమణ 3865 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ గెలిచిన వెంకట రమణ ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వైసిపి నుండి టిడిపిలో కి చేరారు. దీంతో..వైసిపి ఈ స్థానంలో నూతన సమన్వయకర్తను నియమించుకుంది.












Click it and Unblock the Notifications