ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాజాం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా రాజాం ఎస్సీ నియోజకవర్గంగా మారింది. పునర్విభజన అనంతరం రేగిడి ఆముదాలవలస మండలం పూర్తిగా రాజం లో కలిసింది. గతంలో ఉన్న ఉణుకూరు నియోజకవర్గం 2009 లో రద్దు అయిం ది. ఉణుకూరు నుండి ప్రస్తుత టిడిపి ఏపి అధ్యక్షుడు..మంత్రి కళా వెంకటరావు నాలుగు సార్లు గెలుపొందారు. ఆయన సోదరుడు గణపతిరావు ఒక సారి గెలిచారు. ఇక్కడ మరో రాజకీయ కుటుంబం పాలవలస కుటుంబం ముగ్గురు ఎమ్మెల్యే లు అయ్యారు. జిల్లాలో కీలక నియోజకవర్గం ఉన్న ఉణుకూరులో 11 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మూడు సార్లు, టిడి పి అయిదు సార్లు, కెఎల్‌పి, జనతా, స్వతంత్ర అభ్యర్ధులు ఒక్కోసారి గెలిచారు. ఇక, రాజాం నియోజకవర్గం లో టిడిపి సీని చర్ నేత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి రెండు సార్లు ఓడిపోయారు. 2014 ఎన్నిక నాటికి ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తి గా మారిపోయాయి.
2009 లో కాంగ్రెస్..2014 లో వైసిపి గెలుపు..
రాజాం నియోజకవర్గం ఏర్పడిన తరువాత 2009 లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఓడించిన కోండ్రు మురళీ పోటీ చేయగా..టిడిపి నుండి ప్రతిభా భారతి పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో కోండ్రు మురళీకి 61,771 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్ధి ప్రతిభా భారతికి 34,638 ఓట్లు వచ్చాయి. ఇక, 2014 ఎన్నికల నాటికి టిడిపి - వైసిపి మధ్య ప్రధాన పోటీ జరిగింది. 2014 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో మొత్తం 199230 ఓట్లు ఉండగా, అందులో 1417198 ఓట్లు పోల య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన కంభాల జోగులు కు 69192 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన ప్రతిభా భారతికి 68680 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి జోగులు 512 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పని చేసిన కోండ్రు మురళీ ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి 4790 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు.













Click it and Unblock the Notifications