(పిక్చర్స్) హైద్రాబాద్ నుంచే.. ఐసిస్ సానుభూతిపరులు: రఫిక్... యువతితో బెంగళూరుకు

హైదరాబాద్/న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా మెట్రో నగరాల్లో విధ్వంసాలకు కుట్ర పన్నిన ఐసిస్ సానుభూతిపరులు నఫీజ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అబు అనాజ్‌, షరీఫ్‌ మొహియుద్దీన్‌, ఒబేదుల్లాఖాన్‌లు ఇందుకోసం కొన్నిరోజులుగా 12 చోట్ల రెక్కీ నిర్వహించినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

వేర్వేరు నేపథ్యాలున్న ఈ నలుగురూ హైదరాబాద్‌లో తరచూ కలుసుకునేవారని వివరాలు సేకరించారు. కొంతకాలంగా ఐఎస్‌ ఆదేశాల మేరకు వీరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలను నివేదిక రూపంలో తయారుచేశారు. నిందితులను శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

వీరిని ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో సోమవారం రాత్రిలోపు హాజరుపరచాలంటూ జడ్జి ఆదేశించడంతో సాయంత్రం ఢిల్లీకి తరలించారు. వీరివద్ద నుంచి సీపీయూ, ల్యాప్‌ట్యాప్‌, పెన్‌డ్రైవ్‌, నిషేధిత జిహాద్‌ సాహిత్యంతో పాటు పైప్‌బాంబులు తయారుచేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్వల్పమొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, ఐసిస్ సానుభూతిపరులను 13మందిని పోలీసులు దేశవ్యాప్తంగా అరెస్టు చేశారు. బెంగళూరు, తుమకూరు, మంగళూరు, హైదరాబాద్, ముంబై, లక్నో తదితర నగరాలలో.. 12 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో దాడులు చేశారు.

ఇదీ రఫిక్ అహ్మద్!

మన దేశంలో సాయుధ కార్యకర్తలను నియమిస్తున్న ఐసిస్ భారత దళపతి రఫిక్ అహ్మద్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రఫిక్ గతంలో ఢిల్లీలో ఉండేవాడు. అయిదేళ్ల క్రితం వరకు జైషే అహ్మద్‌ సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.

కర్ణాటకలోని బాగల్‌కోటలో యాస్మిన్‌ భాను అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత జైషే అహ్మద్‌‌కు స్వస్తి చెప్పి ఐసిస్‌లో చేరాడు. మన దేశంలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఐసిస్‌ నియామకాల కోసం బెంగళూరు కేంద్రంగా పనులు ప్రారంభించాడు. పట్టుబడ్డవారిలో కొందరు రఫిక్ పేరును వెల్లడించారని తెలుస్తోంది.

అబూ అనాస్

అబూ అనాస్

ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఐసిస్ సానుభూతిపరుడిగా భావిస్తున్న అబు అనాస్.

ముహమ్మద్ నఫీజ్ ఖాన్

ముహమ్మద్ నఫీజ్ ఖాన్

ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఐసిస్ సానుభూతిపరుడిగా భావిస్తున్న ముహమ్మద్ నఫీజ్ ఖాన్.

ముహమ్మద్ ఒబెదుల్లా ఖాన్

ముహమ్మద్ ఒబెదుల్లా ఖాన్

ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఐసిస్ సానుభూతిపరుడిగా భావిస్తున్న ముహమ్మద్ ఒబెదుల్లా ఖాన్.

ముహమ్మద్ షరీఫ్ మోయినుద్దీన్ ఖాన్

ముహమ్మద్ షరీఫ్ మోయినుద్దీన్ ఖాన్

ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఐసిస్ సానుభూతిపరుడిగా భావిస్తున్న ముహమ్మద్ షరీఫ్ మోయినుద్దీన్ ఖాన్.

నాంపల్లి కోర్టు

నాంపల్లి కోర్టు

రిపబ్లిక్ డే సందర్భంగా మెట్రో నగరాల్లో విధ్వంసాలకు కుట్ర పన్నిన ఐసిస్ సానుభూతిపరులు నఫీజ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అబు అనాజ్‌, షరీఫ్‌ మొహియుద్దీన్‌, ఒబేదుల్లాఖాన్‌లు ఇందుకోసం కొన్నిరోజులుగా 12 చోట్ల రెక్కీ నిర్వహించినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

నాంపల్లి కోర్టు

నాంపల్లి కోర్టు

వేర్వేరు నేపథ్యాలున్న ఈ నలుగురూ హైదరాబాద్‌లో తరచూ కలుసుకునేవారని వివరాలు సేకరించారు. కొంతకాలంగా ఐఎస్‌ ఆదేశాల మేరకు వీరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలను నివేదిక రూపంలో తయారుచేశారు. నిందితులను శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ నిఘా అధికారులు ఆరు నెలల నుంచే ఐసిస్‌ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించారు. ఉగ్రవాదులు, వారి అనుచరులు, సామాజిక మాధ్యమాల ద్వారా రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఐసిస్‌ సభ్యుల సమాచారం సేకరించారు.

ఈ క్రమంలోనే నలుగురు ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచగా ఇద్దరు కొద్దిరోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. 2013లో దిల్‌సుఖ్ నగర్‌ జంట పేలుళ్ల విధ్వంసంతోనూ వీరికి సంబంధం ఉందన్న సమాచారం అందింది.

తెలంగాణ నిఘా పోలీసులు వారి కదలికలపై దృష్టి పెట్టగా కీలకమైన సమాచారం లభించింది. రఫీక్‌తో పాటు కర్ణాటకకు చెందిన ఓ యువతి బెంగళూరుకు వెళ్లినట్టు ఆధారాలు దొరికాయి. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఎన్‌ఐఏతో కలిసి దాడుల ప్రణాళిక రూపొందించుకున్నారు.

తెలంగాణకు చెందిన ఒక ఎస్సై నేతృత్వంలో బృందం బెంగుళూరుకు శుక్రవారం వెళ్లింది. బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీ పోలీసుల సాయమూ తీసుకున్నారు. సంయుక్త దాడులు ఫలించి ఐసిస్‌ భారత ముఖ్యనాయకుడు పట్టుబడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+