మెనూ అదిరిపోయింది: టీఆర్ఎస్ ప్లీనరీలో వంటల లిస్టు ఇదే!, ఖర్చెంతంటే!
పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ 26రకాల వంటకాలతో ఘుమఘుమలాడే భోజనాన్ని వడ్డించారు. ఇందుకోసం సుమారు రూ.20లక్షలు పార్టీ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కొంపెల్లిలో జరిగిన గులాబీ ప్లీనరీలో వంటల మెనూ అదిరిపోయింది. పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ 26రకాల వంటకాలతో ఘుమఘుమలాడే భోజనాన్ని వడ్డించారు. ఇందుకోసం సుమారు రూ.20లక్షలు పార్టీ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఇక వంటల విషయానికొస్తే... మాంసాహార ప్రియుల కోసం 2,500 కిలోల మటన్ తో దమ్ కా బిర్యానీ...3000 కేజీల చికెన్ తో దమ్‌కా బిర్యానీ, 15 వేల కోడిగుడ్లతో గుడ్డు పులుసు, 200 కేజీల చేపల ఫ్రై, 200 కేజీల రొయ్యల ఫ్రై,700 కేజీల మటన్ కర్రీ, 300 కేజీలతో మటన్ దాల్చా, 200 లీటర్ల పాలతో పైనాపిల్ ఫిర్నీ స్వీట్, ఫ్లమ్ కేక్ తో పాటు ఐస్ క్రీమ్ ను విందులో అందించారు.
ఇక శాఖాహార మెనూ పరిశీలిస్తే.. మిర్చీకా సాలన్, ఆలు గోబీ, టమాటా కుర్మా, గంగవాయిలి కూర పప్పు, వెజ్ దాల్చ, పచ్చి పులుసు, పెరుగు చట్నీ, పెరుగు, దోసకాయ చట్నీ, ఫ్రూట్ సలాడ్ వంటి ఐటెమ్స్ వడ్డించారు. వంటల పర్యవేక్షకుడిగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యవహరించగా.. నల్లకుంట ప్రాంతానికి చెందిన స్పందన క్యాటరర్స్ ఈ వంటలు తయారు చేసినట్లు సమాచారం. కాగా, టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి 15,000 మంది టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications