కలకలం: బీచుపల్లి కృష్ణానదిలో ముగ్గురు మహిళల మృతదేహాలు
జోగులాంబ: జిల్లాలోని ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద కృష్ణానదిలో గుర్తు తెలియని ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు మహిళలు కృష్ణానది వద్ద సంచరిస్తుండగా.. జాలర్లు ఆరాతీయడంతో తాము కర్ణాటకకు చెందిన వాళ్లమని, అంజనేయ స్వామి సన్నిధిలో నిద్ర చేయాలని ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు.
కాగా, గురువారం ఉదయం కృష్ణానది తీరంలో వారు శవాలై కనిపించారు. మృతుల వయసు 50 నుంచి 55 మధ్యలో ఉంటుందని ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications