హైదరాబాద్ నానక్‌రాంగూడలో భారీ పేలుళ్లు: నలుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని నానక్‌రాంగూడలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఫోనెక్స్ భవనంలో ఈ పేలుళ్లు జరగడంతో దగ్గరలో ఉన్న లారీ, పక్క భవనం కూడా దెబ్బతిన్నాయి. మరో నాలుగు కార్లు కూడా ధ్వంసమయ్యాయి.
గాయపడిన ఇద్దరూ పక్క భవనంలో ఉన్నట్లు తెలిసింది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని వారి అదుపులోకి తీసుకున్నారు. అటువైపుగా ఎవరినీ అనుమతించడం లేదు.

మరిన్ని పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో జిలిటెన్ స్టిక్స్ పేల్చడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications