Heart Attack: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మృతి..
దేశంలో గుండె పోటు మరణాలు పెరుగుతోన్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటుతో మరణిస్తున్నారు. చదువుకునే పిల్లలకు కూడా గుండె పోటు వస్తుంది. ఈ నేపథ్యంలో ఆందోళన నెలకొంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల స్కూల్లో టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుడుమతండాకు చెందిన ఎం.శ్రీకాంత్ కొండాపూర్ గురుకులంలో పదో తరగతి చదువుకుంటున్నాడు.
శుక్రవారం ఉదయం శ్రీకాంత్ సహచర విద్యార్థులతో కలిసి టిఫిన్ తిన్నాడు. తర్వాత ప్లేట్ ను పై అంతస్తులో ఉన తన గదిలో పెట్టేందుకు వెళ్లాడు. తిరిగి మెట్లు దిగుతూ కిందపడిపోయాడు. వెంటనే విద్యార్థులు ఉపాధ్యాయులక సమాచారం ఇచ్చారు. శ్రీకాంత్ ను వెంటనే నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. అయితే శ్రీకాంత్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

గత సెప్టెంబర్ లో గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం 12 ఏళ్ల పాఠశాల విద్యార్థి తరగతిలో కుప్పకూలిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించలోగానే ప్రాణాలు విడిచింది. విద్యార్థిని గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలిక గుండెపోటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.
కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్ లో ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ సడెన్ గా కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఘటనలో ఓ వ్యక్తి హల్ది ఫంక్షన్ కు హాజరయ్యాడు. పెళ్లి కొడకుకు పసుపు రాసేందుకు సిద్ధమయ్యాడు. ఈలోపే అతని కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. కొద్ది రోజుల చికిత్స అనంతరం మృతి చనిపోయాడు.












Click it and Unblock the Notifications