గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం: మానవత్వం చాటిన ఎస్‌ఐ

కాకతీయ ప్రధాన కాలువకు చెందిన డీబీఎం-23 ఉప కాల్వలో 23 సంవత్సరాల వయస్సు గల యువతి మృతదేహం శనివారం లభ్యమైంది.

వరంగల్‌: ఏ గ్రామానికి చెందిన యువతినో తెలియదు, కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చింది. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ విధుల్లో భాగంగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుళ్లిపోయి ఉన్న యువతి మృతదేహాన్ని బయటికి ఈసేందుకు గ్రామస్తులెవరూ ముందుకు రాలేదు.

దీంతో ఎస్‌ఐ తన సిబ్బందితోపాటు కలిసి మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సమీపంలోని వాగు వద్ద ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలు... మండల పపరిధిలోని బావుపేట గ్రామ శివారులోని కాకతీయ ప్రధాన కాలువకు చెందిన డీబీఎం-23 ఉప కాల్వలో 23 సంవత్సరాల వయస్సు గల యువతి మృతదేహం శనివారం వెలుగు చూసింది.

A girl dead body found in bapupeta in Warangal district.

దీంతో ఎస్‌ఐ తిరునగరి వెంకటరంగయ్యసూరీ.. మృతురాలి వివరాలు సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మృతురాలి శరీరంపై వంకాయ రంగులో ఎంబ్రాయిడరీ డిజైన్‌ ఉన్న టాప్‌ వేసుకుని ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయితీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

కెనాల్‌లో ఆడ శిశువు మృతదేహం లభ్యం

వరంగల్‌ ఆటో నగర్‌ శివారు డీహెచ్‌వో ఆఫీసు వద్ద కెనాల్‌లో ఆడ శిశువు మృతదేహం లభించినట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు. ఎస్సార్‌ఎస్పీ కెనాల్‌ సుమారు నెలన్నర వయస్సు ఆడశిశువును స్థానికులు గుర్తించి, బయటకు తీశారని.. అయితే ఆ శిశువు అప్పటికే మరణించి ఉందని తెలిపారు. అడుగున్నర పొడవున్న పాప, గ్రీన్‌ కలర్‌ స్వెట్టర్‌, నలుపు తెలుపు చుక్కల జుబ్బ, కలిగి ఉందన్నారు. పాప మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+