దారుణం: బాలికపై రెండు నెలలుగా అత్యాచారం
నల్గొండ: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలైన బాలికపై దుండగులు రెండు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన మురళి, ప్రవీన్, హరికుమార్ అనే ముగ్గురు యువకులు తరచుగా మద్యం తాగి వచ్చి గత రెండు నెలలుగా గ్రామ సమీపంలో ఉన్న కంపచెట్లలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నారు.
ఆలస్యంగా బాలిక మేనమామకు విషయం తెలియడంతో మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బాధితురాలు గత నెల రోజులుగా కుడుపునొప్పి, జ్వరంతో బాధ పడుతుండటంతో బాధితురాలి పెద్దమ్మ గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడికి చూపించింది.

ఈ క్రమంలోనే ముగ్గురు యువకులు వీధుల్లో తాము చేసిన ఘనకార్యాన్ని తోటి యువకులతో చెప్పటంతో విషయం అదే గ్రామంలో ఉంటున్న బాధితురాలి మేనమామకు తెలిసింది. దీంతో మేనమామ బాధితురాలిని నుంచి విషయం తెలుసుకున్నారు.
వెంటనే ముగ్గురు యువకులపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా వైద్య పరీక్షల నిమిత్తం బాలికను పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ సీఐ భిక్షపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications