మాదాపూర్‌లో టెక్కీ సునీత దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీతను దుండగులు దారుణ హత్య చేశారు.
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీతను దుండగులు దారుణ హత్య చేశారు. మొదట ఆమెను హత్య చేసిన దుండగులు.. ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చేశారు. ఆమె కుటుంబసభ్యులు మృతదేహాన్ని గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించారు.
మాన్‌స్టార్ డాట్ కామ్ కంపెనీలో పని చేస్తున్న సునీత.. బుధవారం ఉదయం ఆఫీసుకు వెళ్ళి, తిరిగి ఇంటికి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా, బుధవారం సాయంత్రం కాలిపోయిన యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యనగర్ కో-ఆపరేటివ్ సొసైటీ సమీపంలోని ఎన్‌ఐఏ భవనం పక్కన ఖాళీ స్థలంలో బుధవారం కాలిపోయిన మృతదేహం పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తిగా కాలిపోయి ఉండటంతో గుర్తు పట్టలేకుండా ఉంది. మృతురాలి వయస్సు 20 నుంచి 22 మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఆమెను ఎవరైనా హత్య చేసి ఇక్కడ కాల్చివేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. కాగా, గురువారం ఆ యువతి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు చూసి.. సునీతగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications