మామ కళ్లల్లో కారం కొట్టి దారుణ హత్య
హన్మకొండలోని రోసరీ పాఠశాల సమీపంలో సాంబయ్య(65) అనే వరంగల్ మాజీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. సీఐ జే సంపత్ రావు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్: హన్మకొండలోని రోసరీ పాఠశాల సమీపంలో సాంబయ్య(65) అనే వరంగల్ మాజీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. సీఐ జే సంపత్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. రోసరీ పాఠశాలలో చదువుతున్న తన మనవడి కోసం టిఫిన్ బాక్స్ తీసుకెళుతున్నారు సాంబయ్య.
అదే సమయంలో ఆయన అల్లుడు బీ మహేందర్ వచ్చి అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆస్తి కోసం వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సాంబయ్య కళ్లల్లో కారం చల్లిన మహేందర్.. తన వద్ద ఉన్న కత్తితో అతడ్ని పొడిచేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన సాంబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

వెంటనే ఘటనా స్థలం నుంచి మహేందర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న వరంగల్ ఏసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న మహేందర్ కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications