నా వైపు చూస్తావా అంటూ కత్తితో దాడి, పరారీ
హైదరాబాద్: తన వైపు చూసినందుకు ఆగ్రహంతో ఊగిపోయి ఓ వ్యక్తి యువకుడిని కత్తితో పొడిచేశాడు. గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ సంఘటన హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇన్‌స్పెక్టర్ రామారావు తెలిపిన వివరాల ప్రకారం - బండ్లగూడ రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన అబ్దుల్ రహమాన్ (19) విద్యార్థి. తన స్నేహితులు అరీఫ్, ఫెరోజ్‌తో కలిసి రాత్రి ఇస్మాయిల్ నగర్‌కు వెళ్లారు. అక్కడ బండిపై చేపలు తినేందుకు ఆర్డర్ ఇచ్చారు.

ఆ తర్వాత తిరిగి వస్తుండగా అక్కడే చేపలను తింటున్న ముబారక్ పింగర్ (25) అనే వ్యక్తి తన వైపు ఎందుకు చూస్తున్నావని ఆగ్రహాంతో అబ్దుల్ రహమాన్‌ను నిలదీశాడు . అంతేకాకుండా తన వద్ద ఉన్న కత్తితో కడుపులో పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
గాయపడిన బాధితుడిని స్నేహితులు ఉస్మానియా వైద్యశాలలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో సైతం పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడి హత్య
నిజామాబాద్ జిల్లా ఖానాపూర్‌లో జరిగిన ఓ హత్య సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్‌లోని భాగ్యనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధుడిని దారుణంగా హతమార్చారు. ఐదు రోజుల క్రితమే హత్య జరిగినట్లుగా అనుమానం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలంను పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications