భార్య అదృశ్యమైందని భర్త ఏం చేశాడో తెలుసా
భార్య ఆచూకీ దొరకలేదని భర్త ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకొంది. రెండుమాసాల క్రితం తన భార్య అదృశ్యమైందని రమేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
మంచిర్యాల :తన భార్య కన్పించకుండా పోయింది. రెండు మాసాలు దాటినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం ఆయన వెతకని ప్రదేశం లేదు. పోలీసులకు కూడ ఫిర్యాదు చేశాడు. తన భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకొంది.
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన చుంచు రమేష్ అనే వ్యక్తి తన భార్య సునీత కన్పించడం లేదని రెండు మాసాల క్రితం పోలీసులకు పిర్యాదుచేశాడు. పోలీసులతో పాటు తాను కూడ ఆమె కోసం వెతుకుతున్నాడు.

రెండు మాసాలుగా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఆమె కోసం తిరిగి తిరిగి విసిగిపోయాడు. ఆమె ఆచూకీకి సంబందించి సమాచారం దొరకలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ మనస్థాపంతో ఆయన శుక్రవారం నాడు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
రమేష్ భార్య సునీత ఎక్కడి కి వెళ్ళిందనేది ఇంకా మిస్టరీగా ఉంది. ఆమె రెండు మాసాలుగా కన్పించకపోవడంతో సునీత తల్లిదండ్రులు కూడ వెతుకుతున్నారు. వారితో పాటు రమేష్ కుూడ వెతుకుతున్నాడు.ఇంత మంది వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో రమేష్ కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు.












Click it and Unblock the Notifications