అమరుల త్యాగాలకు గుర్తింపు చిహ్నం.!శరవేగాంగా స్మారక స్తూపం నిర్మాణం.!
హైదరాబాద్: అమరుల స్మారక చిహ్నం తుది మెరెగుల పనుల్లో వేగం పెంచాలని, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విధించిన నిర్ణీత గడువులోగా పూర్తి కావాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అతి త్వరలో సీఎం చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి అధికారులకు తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ తుదిదశ పనుల పురోగతిని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.

త్వరలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో తుదిదశ పనుల్లో వేగం పెంచాలని అధికారులను,వర్క్ ఏజెన్సీ ని మంత్రి అదేశించారు. అనంతరం సెక్రటేరియట్, అమరవీరుల స్మారక స్థూపం ముందు జరుగుతున్న రోడ్లు జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.

అంతే కాకుండా తెలంగాణ అమర వీరుల త్యాగాలకు సరైన గుర్తింపునిచ్చి, వారి త్యాగాలను వృధాపోనివ్వబోమనే సంకేతాలు తెలంగాణ ప్రజానికానికి ఇవ్వాలని సీఎం సంకల్పించారని, అందులో భాగంగానే అమలరుల స్తూపంతో పాటు అమరుల స్మృతి వనం నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు బాసిన ప్రతిఒక్క కుటుంబాన్ని ఆదుకుంటామని గతంలో సీఎం చంద్రశేఖర్ రావు ఎన్నో వేదికల మీద స్పష్టం చేసారు. అందులో భాగంగానే రాజధాని నడిబొడ్డున అమరుల త్యాగాలకు ప్రతిరూపంగాస్మారక చిహ్నం నిర్మాణం చేపడుతున్నట్టు కూడా మంత్రి పునరుద్గాటించారు.













Click it and Unblock the Notifications