విషాదం: మిడ్ మానేరులో దూకి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలతో ఓ తల్లి మిడ్ మానేరు జలాశయంలోకి దూకింది. ఈ ఘటనలు నలుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు రజిత, అయాన్(7), అసరజా(5), ఉస్మాన్(4నెలలు)గా గుర్తించినట్లు వెల్లడించారు. రజిత స్వస్థలం వేములవాడ మండలం రుద్రంగి అని పోలీసులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం మహమ్మద్ అలీ అనే వ్యక్తిని రజిత ప్రేమ వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

డబ్బుల కోసం భర్త పెట్టే వేధింపులు తాళలేకే తమ కుమార్తె చనిపోయిందని రజిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె మరణానికి కారణమైన మహమ్మద్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
రోడ్డు ప్రమాదంలో -ఇద్దరు మృతి : మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగివున్న కంటైనర్ లారీని వెనుక నుంచి వచ్చిన మరో కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. కర్ణాటకలోని బెంగళూరు నుంచి సామాగ్రితో ఓ కంటైనర్ లారీ నాగ్‌పూర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నార్సింగి మండలం కాస్లాపూర్ వద్ద రోడ్డు పక్కనే టైరు పేలి ఆగివున్న మరో కంటైనర్‌ను అదుపుతప్పి ఢీకొట్టింది.
బెంగళూరు నుంచి వస్తున్న లారీలోని నాగరాజు(25) , బసవరాజు(24) సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications