ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేష్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏ సమస్య వచ్చిందో గానీ ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడున్నవారు వారించినా వినకుండా దూకడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలు కొందరు వీడియో తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్‌​లో నివాసం ఉంటున్న ఓ మహిళ గిరి శిఖర అపార్ట్​మెంట్‌​లోని ఐదో అంతస్తు ఎక్కింది. అక్కడ గోడపైకి ఎక్కి కూర్చుంది. ఈ విషయాన్ని స్థానికులు గమనించి దూకవద్దంటూ కేకలు వేశారు. వారు తెరుకునే లోపు ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది.

A Woman Jumps to Death from 5th Floor in Hyderabad

వెంటనే స్పందించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మరణించినట్లు సమాచారం. కాగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆమె ఎవరితో ఏం మాట్లాడింది అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

బాలుడి అదృశ్య ఘటన విషాదాంతం

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంని చిట్టాపూర్ గ్రామంలో 12 ఏళ్ల బాలుడు అదృశ్యం ఘటన విషాదాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు రాకేశ్ (12) అనే బాలుడు మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీనిపై బాలుడి తండ్రి లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాల్కొండలోని ఖిల్లాగుట్ట ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రాకేశ్ సెప్టెంబర్ 11న రాత్రి అదే గ్రామానికి చెందిన బండి నరేందర్ అనే యువకుడితో కలిసి బైక్ పై వెళ్లాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీంతో నరేందర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడ్ని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+