కేటీఆర్ అరెస్ట్ కు వేళాయే - కీలక ఆదేశాలు..!?
మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదా. హైకోర్టు తాజాగా కేటీఆర్ క్వాష్ పిటీషన్ తిరస్కరణతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును ఏసీబీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కేటీఆర్ విచారణ కోసం ఇప్పటికే నోటీసులు జారీ చేసంది. హైకోర్టు నిర్ణయం పై కేటీఆర్ సుప్రీంను ఆశ్ర యించారు. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులతో ఏసీబీ అఫీషియల్స్ భేటీ కావటంతో ఉత్కంఠ మొదలైంది. కేటీఆర్ అరెస్ట్ ప్రచారం వేళ ప్రతీ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది.
కీలక పరిణామాలు
ఫార్ములా-ఈ కారు రేసు కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. అటు హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో, కేటీఆర్ సుప్రీంలో అప్పీల్ చేసారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఇటు తాను ఏసీబీ విచారణకు వెళ్లేందుకు న్యాయవాదికి అనుమతి ఇవ్వాలని ఈ రోజు హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయనున్నారు. రేపు (గురువారం) విచారణకు రావాలంటూ ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

విచారణకు అరవింద్
అటు, ఫార్ములా-ఈ రేసు తొలి ఒప్పందంలో స్పాన్సరర్‌గా ఉన్న ఏస్ నెక్ట్స్‌జెన్, దాని మాతృ సంస్థ గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ప్రతి అంశాన్ని పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అరవింద్ కుమార్ విచారణలో ఇచ్చే సమాచారం ఆధారంగా రేపు కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. రెండో సెషన్‌కు స్పాన్సరర్ కంపెనీ ఫీజు చెల్లింపు లు.. ఎవరి ఆదేశాలతో చేసారనే సమాచారం ఏసీబీ అధికారులు రాబట్టే అవకాశం ఉంది.
పోలీసు అధికారులతో
ఈ కేసులో అప్రూవర్‌గా మారతానంటూ ఇప్పటికే ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం తో ఈ రోజు అరవింద్ కుమార్ ఇచ్చే సమాచారం కీలకంగా మారనుంది. ఇదే కేసులో ఈడీ అధికారులు కేటీఆర్‌ను ఈ నెల 16న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశారు. ఇటు ఏసీబీ కార్యాల యం కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విచారణ .. అరెస్ట్ ల దిశగా అడుగు లు వేస్తున్న వేళ ఏసీబీ ఉన్నతాధికారుల నుంచి వారికి కొన్ని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ కమిషనర్‌తో కూడా ఏసీబీ ఉన్నతాధికారులు మాట్లాడినట్లు సమాచారం. కేటీఆర్ తది తరుల విచారణ సమయంలో బందోబస్తుపై, ఒకవేళ అరెస్టులు జరిగితే అవసరమైన ఎస్కార్టు గురించి ఏసీబీ నుంచి పోలీసులకు సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications