సినీ నటి స్వాతిరెడ్డి ఇష్యూలో మరో మలుపు: తల్లిపై నిందలు
గుంటూరు: తనకు తల్లితో కలిసి ఉండడం ఇష్టం లేదని సినీ నటి స్వాతిరెడ్డి తెలిపారు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, అయితే తన తల్లి తొందరపాటు వల్లనే ఇంత వ్యవహారం జరిగిందని ఆమె ఆరోపించారు.
తన తండ్రి మరణం విషయంలో మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని, ఆయన గుండెపోటు వల్లనే మరణించారని తెలుసునని స్వాతిరెడ్డి అన్నారు. తాను పుట్టినప్పటి నుంచి తండ్రి తరఫు వాళ్లతో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని ఆమె చెప్పారు.
Also Read: హీరోయిన్ స్వాతి మిస్సింగ్: శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారని ఫిర్యాదు, పరస్పరం దాడి?

ఇప్పుడు కూడా ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. సినిమాలపై దృష్టి పెడుతానని చెప్పారు. ఇక మీదట ఏ విధమైన వివాదాలు లేకుండా తన తల్లికి దూరంగా ఒంటరిగా ఉంటానని చెప్పారు.
కాగా, తన కూతురు అపహరణకు గురైనట్లు స్వాతిరెడ్డి తల్లి నాగేంద్రమ్మ హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరు కూడా ఘర్షణకు దిగారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించి వేశారు.
స్వాతి రెడ్డి 'లవ్' సినిమాలో నటించింది. తన కూతురు స్వాతి రెడ్డిని గుంటూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి మాయ మాటలు చెప్పి తీసుకు వెళ్లిపోయారని తల్లి తన ఫిర్యాదులో ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డికి గతంలోనే పెళ్లయిందని చెప్పారు. స్వాతి రెడ్డి ఇంట్లోని నగదు, నగలను తీసుకు వెళ్లిందని తల్లి చెప్పారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications