అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి ఓకే: చెల్లించాల్సింది రూ.7వేల కోట్లు, వచ్చేది రూ.100 కోట్లు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి జ్యూడిషియరీ కమిటీ ఓకే చెప్పింది. వచ్చే నెల 20, 21వ తేదీల్లో ఆరు అగ్రిగోల్డు ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఈ వేలం ద్వారా రూ.100 కోట్లు రావొచ్చునని అంచనా వేస్తున్నారు.
వచ్చే నెల 18వ తేదీ లోపు వేలంలో పాల్గొనాలనుకునే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని నిర్ణయించారు. అందుకు వేలంలో పాల్గొనే వారు కొంత డబ్బును చెల్లించవలసి ఉంటుంది.
బెంగళూరు, మైసూరు, హోసూరు, ఏపీలోని విజయవాడ సమీపంలో గల ఆశ్తి, మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ ఆస్తులను అమ్మాలని నిర్ణయించారు. ఈ ఆస్తుల అమ్మకం ద్వారా దాదాపు వెయ్యి మంది బాధితులకు న్యాయం చేసే అవకాశముంది.

అయితే, అగ్రిగోల్డ్ బాధితులు దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ఉన్నారు. అలాగే బాధితులకు దాదాపు రూ.7000 కోట్ల ఇవ్వవలసి ఉంది.
ఈ నేపథ్యంలో చెల్లించవలసినది రూ.7000 కోట్లు ఉండగా, ఈ ఆరు ఆస్తుల అమ్మకం ద్వారా కేవలం రూ.100 కోట్లు మాత్రమే రానున్నాయి. ఆస్తులను విడదలవారీగా అమ్మనున్నారు. అమ్మిన ఆస్తుల ద్వారా వచ్చిన మొత్తాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట ఆ డబ్బును జమ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు వచ్చిన రూ.100 కోట్లను వెంటనే బాధితులకు చెల్లిస్తారా? లేక విడతవారీగా అన్ని ఆస్తులు అమ్మిన తర్వాత ఒకేసారి చెల్లిస్తారా? లేక ప్రతి విడతలో వచ్చిన డబ్బును బాధితులకు సమానంగా పంచుకుంటూ వస్తారా? తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications