Runa Mafi: రైతులకు గుడ్ న్యూస్.. దీపావళి కంటే ముందే రైతు రుణ మాఫీ పూర్తి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు పలు హామీలు ఇచ్చింది. రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా సంవత్సరానికి రూ.15 ఇస్తామని పేర్కొంది. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో రైతులు తమకు రూ.2 లక్షలు రుణ మాఫీ అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణ మాఫీకి చర్యలు చేపట్టింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేస్తామని తేల్చి చెప్పారు.
తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల లోపు రుణ మాఫీ చేయాలంటే రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. మూడు దశల్లో మాఫీ చేస్తామని ప్రకటించారు. మొదటగా లక్షలోపు ఉన్న రుణాలు మాఫీ చేశారు. రెండో దశలో రూ.1.50 లక్షలలోపు రుణం మాఫీ చేశారు. చివరిగా రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేశారు. అయితే అందరికి రుణ మాఫీ చేయలేదు. రుణ మాఫీకి కేవలం రూ.18 వేల కోట్లకు పైగా మాత్రమే ఇచ్చారు. దీంతో చాలా మంది అన్నదాతలు రుణ మాఫీ కాలేదని ఆందోళన చెందుతున్నారు.

బ్యాంకులు, అధికారులు చుట్టు తిరిగి అలిసిపోయారు. ఇక ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రశ్నిస్తున్నారు. ప్రతి పక్షాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. బీఆర్ఎస్ చలో ప్రజా భవన్ కు పిలుపునివ్వగా.. బీజేపీ రైతు హామీల సాధన దీక్షను చేసింది. దీంతో ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా రుణ మాఫీ, రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. నిడమానూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.దీపావళి పండుగ కంటే ముందే మిగిలిన 4లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. అయితే దసరా వరకు రుణ మాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడైనా రుణ మాఫీ చేస్తారా లేదా అని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. అలాగే త్వరలో రైతు భరోసా కూడా అందిస్తామని తుమ్మల ప్రకటించారు.












Click it and Unblock the Notifications