కొత్త మంత్రులు, పదవుల్లో మార్పులు - ఢిల్లీ మార్క్ లిస్టులో..!!

ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. ఎంతో కాలంగా వేచి చూస్తున్న మంత్రివర్గ విస్తరణతో పాటుగా ముఖ్య పదవుల భర్తీ పైన ఏఐసీసీ కొత్త లెక్కలతో జాబితా కు రూపు ఇచ్చినట్లు విశ్వస నీయ సమాచారం. సామాజిక లెక్కలు.. సీనియార్టీ ఆధారంగా ఈ లిస్టు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో తీసుకోవాల్సిన చర్యల పైన పార్టీ అధి నాయకత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా రేవంత్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.

ఢిల్లీకి రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ హైకమాండ్ తో కీలక చర్చలు చేయనున్నారు. ఈ మధ్నాహ్నం సీఎం రేవంత్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి ఇంటికి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. పదవుల ఖరారు పైన కీలక చర్చలు జరుగుతున్నాయి. పార్టీ - ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల భర్తీతో పాటుగా డిప్యూటీ స్పీకర్ పదవి పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చీఫ్ విప్.. కార్పోరేషన్ ఛైర్మన్ల పదవులు భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ పదవి లంబాడా వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలకు ఉప సభాపతి పదవి దక్కటం దాదాపు ఖాయమైంది.

AICC implementing interesting equations in TG Cabinet expansion and in key posts

ఎవరికి ఏ పదవి
రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేను చీఫ్ విప్ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. మైనార్టీకి మంత్రి పదవి దక్కనుంది. ఇందు కోసం గ్రేటర్ పరిధిలోని నాయకుడికి అవకాశం దక్కనుంది. నల్గొండ నుంచి మరొకరికి మంత్రిగా ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే, ఇప్పటికే ఇద్దరు మంత్రులుగా ఒకే వర్గానికి చెందిన వారు ఉండటంతో చివరి నిమిషంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి కరీం నగర్ జిల్లా నుంచి మరొకరికి మంత్రి కానున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఆ సీనియర్ నేతను కేబినెట్ లో తీసుకుంటారని సమాచారం.

సామాజిక సమీకరణాలు
ఇద్దరు బీసీలను కేబినెట్ లోకి తీసుకోవాలని ఏఐసీసీ సూచిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒకరికి ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి గతంలో మంత్రిగా పని చేసిన సీనియర్ నేతకు తిరిగి బెర్తు ఖాయమైనట్లు సమాచారం. ఇక, ఉమ్మడి అదిలాబాద్ నుంచి దళిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కనుంది. ఇద్దరు బీసీలతో పాటుగా ఇద్దరు రెడ్డి, ఒక మైనార్టీ, ఒక దళిత వర్గాలకు కొత్తగా కేబినెట్ లో అవకాశం దక్కనుంది. అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లోనూ సామాజిక లెక్కల ఆధారంగా నిర్ణయం చేయనున్నారు. సీఎం రేవంత్ పర్యటనలో ఈ సారి ఏఐసీసీ అన్ని అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+