Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో పొత్తులపై మల్లిఖార్జున ఖర్గే క్లారిటీ..!!

కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతల్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వటం లేదని విమర్శించారు. వీరిద్దరూ హామీలిచ్చి విస్మరించడం తప్ప ప్రజలకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు.

అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పొత్తులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. మంచిర్యాలలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహ సభకు హాజరైన ఖర్గే కీలక ప్రసంగం చేసారు.

AICC President Mallikarjun Kharge hints congress single fight in Telangana, in Mancherial Public Meeting

టార్గెట్ మోదీ- కేసీఆర్: మల్లిఖార్జున ఖర్గే తన ప్రసంగంలో ప్రధాని మోదీ - ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. విచారణ సంస్థలతో కేసులు పెట్టి ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేస్తున్నారని, కేసీఆర్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. కొందరు అంబేద్కర్ కు అతిపెద్ద విగ్రహాలు పెడుతున్నారన్నారు. కానీ, పేదల కోసం మాత్రం ఆలోచన చేయడం లేదని విమర్శించారు.

మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదు. ఇళ్లు కట్టిస్తామని కట్టించలేదని ధ్వజమెత్తారు. దళితులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని మోదీ ప్రశ్నిస్తున్నారని.. ఏం చేయకపోతే ఆయన ప్రధాని అయ్యేవారా అని ఖర్గే ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దళితుల కోసం జనాభా ప్రాతిపదికన స్పెషల్‌ కాంపోనెంట్‌ నిధులు తెచ్చి ఖర్చు చేశామని చెప్పారు.

కాంగ్రెస్ ఒంటరి పోరుపై సంకేతాలు: ఖర్గే తన ప్రసంగంలో తెలంగాణలో పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవనే సంకేతాలు ఇచ్చారు. ఒంటరిగానే పోటీ చేస్తుందనే సంకేతాలతో..ప్రస్తుతం జరుగుతున్న పొత్తు చర్చల పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. కేంద్రం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తోందని ఖర్గే మండిపడ్డారు. బడా వ్యాపారులకు, కార్పొరేట్‌ సెక్టార్లకు ఒక్కొక్కటిగా అన్నింటినీ కట్టబెడుతోందని ధ్వజమెత్తారు.

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్నారు. పేద ప్రజల కోసం మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. సింగరేణిలో ఒకప్పుడు లక్షా 25 వేల మంది పనిచేసే వారని, ఇప్పుడు 40 వేలకు తగ్గిపోయారన్నారు. పార్టీ కోసం తాను చేసిన కృషిని చూసే సోనియాగాంధీ తనకు అత్యున్నత పదవి ఇచ్చారని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ కే అధికారం: రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ పార్టీయేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ ధీమా వ్యక్తం చేసారు. ఆనాడు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును పెడితే.. కేసీఆర్‌ తొలగించారని, ఇందుకు అదే అంబేడ్కర్‌ సాక్షిగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని అన్నారు.

హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టామని గొప్పగా చెప్పుకొంటున్నారని, అయితే 125వ జయంతి నాడు విగ్రహం పెడతానని చెప్పి.. 132వ జయంతి నాడు పెట్టారని విమర్శించారు. మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చామని, త్వరలో ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+