గన్ మెన్ల ను సరెండర్ చేసిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కారణమిదే
శాంతినగర్ ఎస్ ఐ వ్యవహరిస్తున్న తీరు నచ్చక తన గన్ మెన్లను సరెండర్ చేశాడు ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఎస్ ఐ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన చెప్పారు.
ఆలంపూర్ : శాంతినగర్ ఎస్ ఐ వ్యవహరిస్తున్న తీరు నచ్చక తన గన్ మెన్లను సరెండర్ చేశాడు ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఎస్ ఐ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన చెప్పారు.
దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఓ దళిత యువకుడిని నడిరోడ్డుపై గుండు గీయించారని ఈ విషయమై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
శాంతినగర్ ఎస్ ఐ తీరు మార్చుకోవడం లేదని పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

తన నియోజకవర్గంలోని ప్రజలకు రక్షణ లేనప్పుడు తనకు రక్షణ అవసరం లేదన్నారు ఎమ్మెల్యే సంపత్ కుమార్. దళితుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని చెప్పారాయన.
అందుకే తనకు రక్షణగా ఉండాల్సిన గన్ మెన్లను కూడ సరెండర్ చేస్తున్నట్టు ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రకటించారు.ఈ ప్రభుత్వంలో దళితులపై వివక్ష కొనసాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications