• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యజ్ఞంలా సాగిన లాక్‌డౌన్‌.!తగ్గిన కేసులు.!కానీ మద్యం షాపుల వల్ల మళ్లీ పేట్రేగిపోతున్న వైరస్.!

|

అమరావతి/హైదరాబాద్ : కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలను ఈ మహమ్మారి వైరస్ గడగడలాడిస్తూనే ఉంది. ఇదే సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. ప్రభుత్వాలన్నీ పకడ్బంధీగా కరోనా కట్టడి కార్యక్రమాలను చేపట్టాయి. ఆరోగ్య రంగాన్ని ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన దేశాలు, రాష్ట్రాలు ప్రజారోగ్య పరిరక్షణకు పెద్ద పీఠ వేసాయి. ఒక రకంగా ఆ విషయంలో సహచర దేశాలు ఇప్పుడు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. అదే బాటలో భారతదేశంతో పాటు అన్నీ రాష్ట్రాలు కరోనా నియంత్రణకు మునుపెన్నడూ లేని ముందు జాగ్రత్తలను అవలంభించాయి.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్...

 కొంప ముంచింది మద్యం షాపులేనా..? కరోనా విజృంభానికి కారణమవుతున్న వైన్ షాపులు..

కొంప ముంచింది మద్యం షాపులేనా..? కరోనా విజృంభానికి కారణమవుతున్న వైన్ షాపులు..

దీంతో పాటు లాక్‌డౌన్‌ ఆంక్షలు, స్వీయనియంత్రణ పాటిస్తూ కరోనా వైరస్ సోకకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. స్వీయ నియంత్రణకు అలవాటుపడిపోయిన ప్రజలు చాలా వరకు బయటి ప్రపంచాన్ని మర్చిపోయారు. ఏదైనా ఇంట్లో తయారైన తినుబండారాలను ఆస్వాదిస్తూ కేంద్క రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సహకారం అందించారు. ప్రజలు ఎంతగానో ఇష్టపడే మద్యం అలవాటును కూడా మానుకుని ప్రభుత్వాలకు సహకరించారు ప్రజలు. దాదాపు 45రోజులుగా మద్యం అందుబాటులో లేకున్నా హాయిగా జీవితాన్ని నెట్టుకొచ్చారు సామాన్య ప్రజలు.

 లాక్‌డౌన్‌ ఆంక్షలను లెక్క చేయని మందు బాబులు.. వైన్ షాపుల ముందు గుంపులే గుంపులు..

లాక్‌డౌన్‌ ఆంక్షలను లెక్క చేయని మందు బాబులు.. వైన్ షాపుల ముందు గుంపులే గుంపులు..

మద్యం షాపులు లేకపోవడం, జనం సమూహాలుగా ఏర్పడక పోవడంతో కరోనా వైరస్ కూడా అదుపులోకి వచ్చిందనే చర్చ మొదలైంది. కాగా ప్రజలకు ఉన్నంత కృతనిశ్చయం ప్రభుత్వాలకు లేదనే అంశం స్పష్టమవుతోంది. ఆర్ధిక రంగం కుదేలవుతుందని సాకు చూపి మద్యం దుకాణాలకు అనుమతులిచ్చిన ప్రభుత్వాలకు తగిన గుణపాఠం ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. తగ్గిన కరోనా కేసులు తెరుచుకున్న మద్యం షాపుల ద్వారానే మళ్లీ వ్యాపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను దీక్షలా చేపట్టారు తెలుగు ప్రజలు. కానీ ప్రజల పట్టుదల, కరోనా వైరస్ ను తరిమికొట్టాలన్న కృతనిశ్చయం ప్రభుత్వాల వ్యూహాల ముందు నిలవలేకపోయింది.

 దాదాపు నెల పదిహేను రోజులు మద్యానికి దూరం.. షాపులు తెరుచుకోవడంతో రెచ్చి పోయిన తాగుబోతులు..

దాదాపు నెల పదిహేను రోజులు మద్యానికి దూరం.. షాపులు తెరుచుకోవడంతో రెచ్చి పోయిన తాగుబోతులు..

దాదాపు 43 రోజులుగా మద్యం సేవించకుండా మందుబాబులందరూ ప్రభుత్వాలకు సహకరించారు. ప్రజలందరూ స్వీయనియంత్రణకు కట్టుబడి ఇన్నిరోజులుగా ఇంట్లోనే ఉన్నా ఎలాంటి కలహాలు చెలరేగలేదు. ఇలా సాదాసీదాగా కొనసాగుతున్న కుంటుంబాల్లో మద్యం దుకాణాలకు ఇచ్చిన మినహాయింపులు కుటుంబాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. కేంద్రం లాక్‌డౌన్‌ ఆంక్షలను తొలగించి అత్యవసరమైన వాటిని పునఃప్రారంభించవచ్చని కల్పించిన వెసులుబాటు, ప్రభుత్వాలకు ఆదాయ మార్గంగా కనిపించింది. ఆదాయం పెంచుకొనేందకు మద్యం దుకాణాలను తెరవాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి.

 మాస్కు లేదు.. సామాజిక దూరం లేదు.. పెరిగిన కరోనా కేసులకు కారణం అదే అంటున్న నిపుణులు..

మాస్కు లేదు.. సామాజిక దూరం లేదు.. పెరిగిన కరోనా కేసులకు కారణం అదే అంటున్న నిపుణులు..

ముందుగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు అనుమతినిచ్చింది అక్కడి ప్రభుత్వం. మద్యం అక్రమ రవాణాను నియంత్రించే క్రమంలో తెలంగణలో కూడా మద్యం షాపులకు అనుమతిచ్చారు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు. ఫలితంగా భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా మందుప్రియులంతా ఒక్కసారిగా సమూహాలుగా ఏర్పడ్డా పట్టించుకున్న నాధుడు కరువయ్యాడు. కరువు ఎద్దడి ప్రాంతాల్లో జనాలు నీటి కోసం కొట్టుకున్నట్టు దుకాణాలపై ఎగబడ్డారు. షాపులు తెరిచుకున్న తొలిరోజు జూన్ 4వ తేదీన మద్యం షాపుల ఎదుట దృశ్యాలు చూస్తే అసలు మనం లాక్‌డౌన్‌లోనే ఉన్నామా అన్న సందేహం రాకమానదు. సరిగ్గా ఇవే పరిణామలు తగ్గిన కరోనా కేసులను తిరగదోడాయనే చర్చ జరుగుతోంది.

English summary
The government had earlier approved liquor shops in Andhra Pradesh. Telangana CM Chandrasekhar Rao has also allowed liquor shops in Telangana to curb the smuggling of liquor. As a result, all at once without practicing physical distance and without wearing masks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X