సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారా? జర భద్రం.. దొంగతనాలపై పోలీసుల అలెర్ట్!

సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే ప్రతీ ఒక్కరూ తమ స్వగ్రామాలకు వెళ్తారు. ముఖ్యంగా హైదరాబాద్ సంక్రాంతి సమయంలో ఖాళీ అవుతుంది. హైదరాబాద్ లోని ఏపీ సెటిలర్స్ తమ సొంత ఊర్లకు వెళ్తారు. అయితే సంక్రాంతి పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు తమ ఇంటికి తాళం వేయాల్సిన అవసరం ఉంటే, వారి ప్రయాణ ప్రణాళికల గురించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.

సంక్రాంతికి ఊరు వెళ్లేవారికి సైబరాబాద్ పోలీసుల అలెర్ట్
ఈరోజు జారీ చేసిన ఒక అడ్వైజరీలో, అదనపు భద్రత కోసం ఊర్లకు వెళ్తున్న వారు ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌తో తాళాలు ఏర్పాటు చేసుకోవాలని, వారి ఇంటికి భద్రతా అలారం వ్యవస్థతో పాటు మోషన్ సెన్సార్‌లతో కూడిన సిసిటివి కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా, ఎవరికైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్టు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చెయ్యాలని, లేదా 100 కు డయల్ చెయ్యాలన్నారు.

Are you going to hometown for Sankranti But there is a chance of theft Stay safe with these tips

దొంగతనాలపై ఈ నంబర్లకు ఫిర్యాదు చెయ్యండి
సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100, మరియు వాట్సాప్ నంబర్ 9490617444కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. తమ ద్విచక్ర వాహనాలను తమ కాంపౌండ్ లోపల ఉంచుకోవాలని, అవి లాక్ చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోవాలని సూచించారు. రోడ్లపై వాహనాలు పెట్టి వెళ్ళవద్దన్నారు. వీలైతే వీల్ చైన్లతో మరింత బందోబస్తుగా లాక్ చెయ్యాలని కూడా సూచించారు.

దొంగతనాలు జరగకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోండి
చెత్త, పాల ప్యాకెట్లు లేదా వార్తాపత్రికలను తాళం వేసిన తలుపుల వెలుపల ఉంచవద్దని, వాటిని ఇళ్ళ ముందు కనపడనివ్వొద్దు అన్నారు. ఇక తలుపులకు వేసిన తాళాలను బయటకు కనపడనీయకుండా వాటిని కర్టెన్లతో కప్పాలని సూచించారు. విశ్వసనీయ పొరుగువారికి వారి తమ ప్రయాణాల గురించి తెలిపి, తమ ఇంటిపై ఓ కన్ను వేసి ఉంచాలని, అనుమానం వస్తే కాల్ చెయ్యాలని చెప్పాలన్నారు. విశ్వసనీయ వ్యక్తులకు తప్ప మరెవరికీ ప్రయాణ ప్రణాళికలను వెల్లడించవద్దని కూడా వారు సూచించారు.

ప్రయాణాలు చేసే సమయంలో కూడా జాగ్రత్త
సంక్రాంతికి ఊరు వెళుతున్న వారు దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్న క్రమంలో బంగారాన్ని లాకర్లలో పెట్టుకొని వెళ్తే మంచిదని అంటున్నారు . ఇంట్లో నగదు కూడా లేకుండా జాగ్రత్త చేసుకోవడం మరీ మంచిది. విలువైన వస్తువులను తమతో తీసుకువెళ్లడం మంచిది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. పని మనుషులు ఉంటే ప్రతి రోజు ఇంటి ముందు ఉడ్చి ముగ్గు పెట్టే లాగా చూడాలన్నారు. ఈ జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటిస్తే దొంగతనాలు జరగకుండా కాపాడుకోవచ్చని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+