ఆ మెడికల్ కాలేజీకి బాపూజీ పేరు.. రుణం తీర్చుకుంటానన్న సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తనను ఆశీర్వదించిన కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

నేతన్నలకు ప్రభుత్వ ఆర్ఢర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండొద్దని భావించి.. మహిళా సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ చెప్పారు. 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లు రాష్ట్ర నేన్నలకు ఇస్తున్నామన్నారు. ఇక, తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Asifabad Medical College named after Konda Laxman Bapuji CM Revanth Reddy

కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మాజీ సీఎం కేసీఆర్ కనీసం చూసేందుకు కూడా వెళ్లలేదని రేవంత్ విమర్శించారు. టెక్‌టైల్ వర్సిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా ఆయన పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Asifabad Medical College named after Konda Laxman Bapuji CM Revanth Reddy

భారత్ జోడో యాత్రలో బలహీనవర్గాల కష్టాలను రాహుల్ గాంధీ చూశారని సీఎ రేవంత్ చెప్పారు. కుగణన చేసి జనాభా దామాషాలో బీసీలకు న్యాయం చేయాలన్నది ఆయన ఆశయమన్నారు. ఈ క్రమంలోనే లక్షల మంది ఎన్యుమరేటర్లను నియమించి రాష్ట్రంలో పకడ్బందీగా కులగణన నిర్వహించామని సీఎం రేవంత్ తెలిపారు.

Asifabad Medical College named after Konda Laxman Bapuji CM Revanth Reddy

మండల కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. కులగణన నచ్చనివారు సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. తప్పు ఎక్కడ జరిగిందో మాత్రం నిరూపించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి నరేంద్ర మోడీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతల భయమని సీఎ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+