ఆటోలో వచ్చాడని ఎమ్మెల్యేకు చేదు అనుభవం
హైదరాబాద్: దర్భానికీ దర్జాకు మాత్రమే గుర్తింపు, గౌరవం ఉంటుందనే విషయం ఓ శాసనసభ్యుడి విషయంలోనూ రుజువైంది. ఆటోలో అతి సాధారణంగా హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఖమ్మం జిల్లా భద్రాచలం సిపిఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది.
ఆటోలో వచ్చిన ఎమ్మెల్యేను లోనికి అనుమతించలేదు. తాను ఎమ్మెల్యేనని చెప్తే కూడా వినకుండా గుర్తింపు కార్డు చూపించాలని అడిగారు. దాంతో ఆయన ఆటో దిగి లోనికి నడుచుకుంటూ వెళ్లారు. భద్రాచలం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను గుర్తించకపోవడంపై రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో వస్తే తప్ప గుర్తు పట్టరా అని ఆయన అడిగారు.

సచివాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో తనను తనిఖీ సిబ్బంది అవమానించారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయానికి తాను ఆటోలో వచ్చానని, ఎమ్మెల్యేనని చెబుతున్నా వినకుండా నన్ను ఆటో నుంచి దించారని ఆయన అన్నారు. కార్లలో మంది మార్బలంతో వచ్చే వారే ఎమ్మెల్యేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం మీడియా పాయింట్‌లో తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ ఇలాంటి పద్ధతులు మంచిది కాదని, ఈ వ్యవహారాన్ని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications