బాలయ్య అభిమానులు ఏం చేస్తున్నారో తెలుసా?: మెచ్చుకోవాల్సిందే!

ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులు పలు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు.

హైదరాబాద్/విశాఖపట్నం: ప్రముఖ టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులు పలు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. బాలకృష్ణ 101వ సినిమా 'పైసా వసూల్' విడుదల సందర్భంగా 101మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు తెలిపారు.

బాలకృష్ణ అభిమాన సంఘం రంగారెడ్డి జల్లా అధ్యక్షుడు ఎన్ఎస్ రాజు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన బాలకృష్ణ అభిమానుల పిల్లల కోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.

Balayya scholarships for poor now

ఆదాయ, విద్యా సంబంధిత ధృవపత్రాల జిరాక్సులతో ఆగస్టు 10వ తేదీలోపు పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని చెప్పారు.

అర్హులైన 101 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి.. పైసావసూల్ సినిమా విడుదలయ్యే లోపు నిర్మాత ఆనందప్రసాద్ చేతుల మీదుగా అందజేస్తామని రాజు తెలిపారు. వివరాల కోసం ఫోన్ నెం. 9396699955 సంప్రదించాలని కోరారు. కాగా, ఏపీలో విశాఖపట్నంతోపాటు ఇతర జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+