ఉగ్రవాదులకు నిలయంగా మజ్లిస్, వారితో టిఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం: దత్తాత్రేయ

హైదరాబాద్: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం నాడు అధికార తెరాస పైన, మజ్లిస్ పార్టీ పైన తీవ్రంగా మండిపడ్డారు. షేక్‌పేట, మాదాపూర్, ఓవైసీ నగర్‌లో ఉగ్రవాద జాడలు ఉన్నాయని, మజ్లిస్ ఉగ్రవాద శక్తులకు నిలయంగా మారిందని ధ్వజమెత్తారు.

మజ్లిస్ పార్టీతో తెరాస లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. తెరాసది అవగాహనరాహిత్య పాలన అన్నారు. హైదరాబాదులో స్వచ్ఛ భారత్ పనులు కనబడటం లేదన్నారు. స్వచ్ఛ భారత్ కోసం రాష్ట్రానికి కేంద్రం రూ.100 కోట్లు ఇచ్చిందన్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న టిడిపి - బిజెపి ఉమ్మడి మేనిఫెస్టోను ఆదివారం నాడు విడుదల చేసింది. 'హ్యాపీ హైదరాబాద్' పేరుతో విజన్ డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఒక సమగ్రమైన అభివృద్ధికి, నగరంలో కోటి జనాభా ఉన్నటువంటి వారి సంక్షేమం కోసం ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.

Bandaru Dattatreya hot comments on TRS

శివారు ప్రాంతాలకు నష్టం జరుగుతోందని, ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నప్పటికీ మజ్లిస్ హయాంలో ఆ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే ఇప్పుడు బిజెపి - టిడిపిలు కలిసి మెట్రో పాలిటన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

గత అయిదేళ్లలో జరిగిన వివక్ష భవిష్యత్తులో ఉండకుండా ఉండాలంటే బిజెపి - టిడిపికి కూటమిని గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో ఎన్నో పొందుపర్చారు. నీటి కొరత తీరుస్తామన్నారు. శివారు ప్రాంతాలకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.

హైదరాబాదును పూర్తి వైఫై నగరంగా మారుస్తామన్నారు. అవినీతిరహితంగా జిహెచ్ఎంసిని చేస్తామన్నారు. ప్రతి ఇంటికి మంచి నీటి కనెక్షన్ ఇస్తామని, అలాగే పేదలకు ఉచిత నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. మేం అధికారంలోకి వస్తే తప్పకుండా అవినీతిని అరికడతామన్నారు.

గ్రేటర్లో శుభ్రత, భద్రత, అభివద్ధి మా నినాదమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. మంచి డ్రెయినేజీ వ్యవస్థను నిర్మిస్తామన్నారు. మహిళలకు రుణాలు ఇస్తామన్నారు.

తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ఆశ్తి పన్ను పెంచిందని, పన్ను కట్టని వాళ్ళ ఇళ్ల ముందు గుంతలు తవ్వించిందని, విద్యుత్ సరఫరా నిలిపివేసిందని, నల్లా రాకుండా చేసిందని, డ్రెయినేజీ డిస్ కనెక్ట్ చేసిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెరాస ప్రభుత్వం అవినీతిని అరికట్టలేకపోయిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+