3 తర్వాత కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్: బీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్. డిసెంబర్ 3న బీఆర్ఎస్ కరెంట్ కట్ అవుతుందని.. కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ రోడ్‌షోలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు.

తాను ఓటుకు రూ. 20 వేలు ఇస్తానని మంత్రి గంగుల కమలాకర్ దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తాను అక్రమాస్తులు సంపాదించానని మంత్రి గంగుల తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అక్రమాస్తులను నిరూపిస్తే ప్రజలకే ఇచ్చేస్తానంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. భారీ వర్షాలతో కరీంనగర్ చుట్టుప్రక్కల గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు రూ. 10 వేలు ఇవ్వలేదు గానీ.. పంజాబ్ రాష్ట్రానికి పది లక్షల సాయం చేశారని కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ మండిపడ్డారు.

bandi sanjay hits out at kcr govt and minister kamalakar in karimnagar raodshow

ధాన్యం తరుగులో మంత్రి‌ గంగుల కమలాకర్ పాత్ర లేదని.. ఆయన దేవుడి‌ గుడిలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు బండి సంజయ్. పండించిన ప్రతి‌ ధాన్యం గింజను కేంద్ర ‌ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. పేపర్ లీకేజ్ వల్ల తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారని.. వారికి మద్దతుగా తాను ధర్నా చేస్తే.. మంత్రి గంగుల కమలాకర్, సీఎం కేసీఆర్ తనను జైలుకు పంపారని బండి చెప్పారు.

తన మీద కక్ష్య కట్టి 74 కేసులు పెట్టారని బండి సంజయ్ తెలిపారు. గంగుల కమలాకర్ డబ్బులను నమ్ముకుని‌ కరీంనగర్‌లో పోటి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరీంనగర్ పార్లమెంట్‌ ‌పరిధిలో రూ. 7 వేల కోట్ల నిధులను అభివృద్ధి కోసం తీసుకొచ్చినట్టు బండి సంజయ్ తెలిపారు.

బీఆర్ఎస్, బీజేపీల మధ్య అసలైన పోటీ: రాజా సింగ్

గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. రాజాసింగ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే అధిక లాభాలుంటాయని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే అసలైన పోటీ ఉంటుందన్నారు రాజా సింగ్.

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. పదేళ్లలో గోషామహాల్​లో ఎంతో అభివృద్ధి చేశామని రాజా సింగ్ తెలిపారు. తాను చేసిన అభివృద్ధి పనులపై చిన్న పుస్తకాన్ని విడుదల చేసి.. ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల కోసం ఇతర పార్టీలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. గోషామహాల్​లో రూ.500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఆ అభివృద్ధే తనని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+