Bank: రూ.4 వేల కోట్లకు.. రూ.400 కోట్లా.. ఇలా అయితే ఎలా..!
ఇందూ ప్రాజెక్ట్స్ సంస్థ రూ.4 వేల కోట్ల అప్పకు రూ.400 కోట్లు తీసుకోవడానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి.
చాలా మంది రైతులు, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వారు బ్యాంకుకు వెళ్లి అతి కష్టంగా లక్షో, రెండు లక్షల రూపాయల లోన్ తీసుకుంటారు. తీసుకున్న అప్పును వడ్డీతోపాటు అన పైసా పోకుండా బ్యాంకుకు గడతారు. ఒకవేళ ఒక్క రూపాయి కట్టకపోయినా బ్యాంకు వారు మనల్ని వేధిస్తుంటారు. కానీ కార్పొరేట్ సంస్థలకు మాత్రం వందల కోట్లు మాఫీ చేస్తుంటారు. రూపాయి పోకుండా చెల్లించే మనకు.. బ్యాంకులో సరైన గౌరవం ఉండదు.. కానీ వేల కోట్లు ఎగ్గొంటే వారికి మాత్రం బ్యాంకు అధికారులు రాచమర్యాదలు చేస్తారు.

రూ.400 కోట్లు
తాజాగా ఓ సంస్థకు బ్యాంకులు వందల కోట్లలో రుణాన్ని మాఫీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇది చర్చనీయంశంగా మారింది. ఇందూ ప్రాజెక్ట్స్ వారు వివిధ బ్యాంకుల వద్ద దాదాపు రూ.4 వేల కోట్లు అప్పు చేశాయి. అయితే ఆ సంస్థ దివాలా తీయగా.. రూ.400 కోట్లు మాత్రమే తీసుకునేందు రెడీ అయ్యాయి. ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా వంశీరాం బిల్డర్స్ కన్సార్షియం సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీ ఆమోదం తెలిపినట్లుసమాచారం.

రూ.450 కోట్ల
ఇందులో భాగంగా సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల మధ్య చెల్లింపులకు సంసిద్ధత వ్యక్తంచేస్తూ వంశీరాం బిల్డర్స్ కన్సార్షియం ప్రణాళిక సడ్మిట్ చేసింది. దీనికి రుణదాతల కమిటీ అంగీకరించడంతో రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్‌పీ) హైదరాబాద్ ఎన్‌సీఎల్‌టీ ఆమోదం కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదించే పక్షంలో ఇందూ ప్రాజెక్ట్సు వంశీ బిల్డర్ కన్సార్షియం చేతిలోకి వెళ్తుంది.

ప్రణాళిక రద్దు
గతంలో మరోసారి రుణ పరిష్కార ప్రణాళిక ఎర్తిన్ కంపెనీ సమర్పించింది. రుణదాతలకు రూ.500 కోట్లు, ఇందూ కంపెనీ నిర్వహణకు మరో రూ.40 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎర్తిన్ ముందుకొచ్చింది. కానీ గడువులోగా సొమ్ము చెల్లించకపోవడంతో ఎన్‌సీఎల్‌టీ పలుమార్లు గడువును కూడా పొడిగించింది. చివరకు రుణపరిష్కార ప్రణాళికను రద్దు చేసింది. దీంతో రుణ పరిష్కార ప్రణాళిక కోసం తాజాగా మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడంతో వంశీ బిల్డర్ కన్సార్షియం రుణ పరిష్కార ప్రణాళిక సమర్పించింది.












Click it and Unblock the Notifications