బీఆర్ఎస్‌కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు

లోక్‌సభ ఎన్నికల ముందు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్‌​కు మరో భారీ షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్​‌కు పంపించారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​‌కు మద్ధతు ఇస్తున్నట్లు ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.

ఈ క్రమంలో కేంద్రమంత్రి హర్​దీప్ ​సింగ్ పూరి సమక్షంలో బీజేపీలో చేరారు బేతి సుభాష్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే బీజేపీలోకి చేరిన వారిలో జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్, నాగర్​ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు భరత్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (వరంగల్ స్థానం), హుజుర్ ​నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(నల్గొండ స్థానం) తదితరులు పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.

Bethi Subhas Reddy Resigns To BRS joins BJP

కాగా, అధికారాన్ని కోల్పోయి నాలుగు నెలలు కూడా గడవకముందే బీఆర్ఎస్ నాయకులంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్నారు. లోక్‌​సభ ఎన్నికల ముంగిట పార్టీలో వలసలు, బీఆర్ఎస్​‌కు తలనొప్పిగా మారాయి.

సిట్టింగ్ ఎంపీలు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా వివిధ స్థాయిలోని నేతలు కాంగ్రెస్ లేదంటే బీజేపీలో చేరుతున్నారు. పార్టీ మారే వారిని ఆపడటం బీఆర్ఎస్ అధిష్టానానికి కూడా కష్టసాధ్యంగా మారింది. మరోవైపు, లోక్ సభ ఎన్నికల తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదని కాంగ్రెస్ మంత్రులు చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+