4మండలాల్ని ఇటు తెలంగాణ, అటు ఏపీ పట్టించుకోవట్లేదు: రాజయ్య
ఢిల్లీ: భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. ఏపీ అసెంబ్లీలో తనకు అసోసియేటెడ్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఆయన వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుర. ఇటీవల ఏపీలో కలిసిన నాలుగు మండలాలను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇది అన్యాయమన్నారు. తనను గెలిపించిన ప్రజలకు తాను న్యాయం చేయలేకపోతున్నానని చెప్పారు. నాలుగు మండలాల అభివృద్ధికి ఏపీ, తెలంగాణలు నిధులివ్వాలన్నారు.

గృహనిర్మాణ లబ్ధిదారుల ఇళ్ల బిల్లులను వెంటనే చెల్లించాలి: రమణ
గృహ నిర్మాణ లబ్ధిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ డిమాండ్ చేశారు.
గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా హన్మకొండలో ఎర్రబెల్లి దయాకర రావు చేపట్టిన దీక్షా శిబిరం వద్ద రమణ మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రాు వెంటనే ఇళ్ల బిల్లులు చెల్లించాలన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇళ్లు కట్టుకొని అప్పులపాలు అయ్యారన్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై పోరాటంలో రాజీలేదన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications