బీఆర్ఎస్‌లోకి భద్రాద్రి బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ: ఆ రెండు పార్టీలపై కేటీఆర్ నిప్పులు
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి ఆయనను కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోనిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలు డబ్బులు బాగా సంపాదించి.. వాటితో ఓట్లు కొనాలనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. డబ్బులిస్తే తీసుకోవాలని.. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మవద్దని అన్నారు.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ఓటర్లను డబ్బుతో కొనొచ్చని కాంగ్రెస్ నేతలు నుకుంటున్నారని.. ఒకవేళ కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకుని, కారు గుర్తుకే ఓటేయాలన్నారు మంత్రి కేటీఆర్. దశాబ్దాలపాటు మనల్ని హింసించిన వాళ్లు.. ఇవాళ కొత్త కొత్త వేషాలు వేసుకుని వస్తున్నారన్నారు. అలాంటి వాళ్ల మాటలు నమ్మవద్దని కేటీఆర్ సూచించారు.
ఎ నుంచి జడ్ వరకు స్కాంలు చేసిన కాంగ్రెస్ నేతలు బాగా డబ్బు సంపాదించారని.. ఆ డబ్బుతో ఓట్లు కొని అధికారంలోకి రావొచ్చని పగటి కలలు కంటున్నారని కేటీఆర్ విమర్శించారు. మోసాన్ని మోసంతోనే దెబ్బకొట్టాలన్నారు. మరోవైపు, బీజేపీపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
కేంద్రంలోని బీజేపీ చేసేందేమీ లేదని.. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే ఐదు మండలాలను ఆంధ్రాకి అప్పగించిందని మండిపడ్డారు. లోయర్ సీలేరును కూడా ఏపీకిచ్చారన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ బీజేపీ అని విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే ఎత్తడం లేదన్నారు. సెప్టెంబర్ 17 గాయాలు మానుతూ ఉంటే.. చిల్లర మల్లర సినిమా తీస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

వరుసగా మూడోసారి కేసీఆర్‌ను గెలిపించి.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఉమ్మడి ఖమ్మంలోని ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని.. రైతులు, ప్రజలు ఆనందంగా ఉంటారని అన్నారు.












Click it and Unblock the Notifications