అజారుద్దీన్ కు మంత్రి పదవి వేళ బిగ్ ట్విస్ట్ - దక్కేనా, ఆగేనా..!?
అజారుద్దీన్ కు మంత్రి పదవి వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజారుద్దీన్ రేపు (శనివారం) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. ఇదే సమయంలో అజారుద్దీన్ మంత్రి కావటం పైన ఫిర్యాదులు మొదలయ్యాయి. దీంతో.. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి పైన కొత్త చర్చ మొదలైంది. మరి.. ఏం జరగనుంది..
అజారుద్దీన్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇందుకు రేపే ముహూర్తం గా ఫిక్స్ చేసారు. రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అజారుద్దీన్ కు ఇచ్చే మంత్రిత్వ శాఖ పైనా పార్టీలో చర్చ జరుగుతోంది. తొలుత మైనార్టీ సంక్షేమం తో పాటుగా క్రీడల శాఖ ఇస్తారని ప్రచారం సాగింది. అయితే, హోం శాఖ ఇవ్వనున్నట్లుగా తాజాగా పార్టీ నేతల సమాచారం. ఇంకా తుది నిర్ణయం జరగాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్ బ్యాంక్ కీలకంగా మారుతోంది. ఈ సమయంలోనే అజారుద్దీన్ కు మంత్రిగా తీసుకోవటం ద్వారా రాజకీయంగా కలిసి వస్తుందని రేవంత్ అంచనా. రేవంత్ సైతం ప్రచారంలోకి వస్తున్నారు. అయితే, ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్దం అవుతున్న వేళ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో జూబ్లీహిల్స్‌లో కాంటెస్ట్ చేసిన అజారుద్దీన్‌కు ఈ సమయంలో మంత్రి పదవి ఇవ్వడం పై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో ఒక వర్గం ఓట్లపై ప్రభావం చూపేలా ఉన్న మంత్రివర్గ విస్తరణను ఆపాలని ఈసీకి బీజేపీ నేతలు కోరారు. జూబ్లీహిల్స్ పోలింగ్ అయ్యే వరకు అజారుద్దీన్ కు మంత్రి పదవి వాయిదా వేసేలా చూడాలని ఈసీకి వినతి పత్రం సమర్పించారు. అజారుద్దీన్ కు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఒక వర్గం ఓటర్లను మభ్య పెట్టడమేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవినే ఊగిసలాట లో ఉందని వ్యాఖ్యానించారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈసీ జోక్యం చేసుకుంటుందా.. ఎన్నికల కోడ్ ఏం చెబుతోంది... తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications