వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎంపీలు పశువులు.!సోనియా గాంధీకి,మోడీకి భయపడే వాడు ఎవ్వడూ లేడన్న మంత్రి కేటీఆర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని విమర్శించిన వాళ్ళు ముక్కున వేలు వేసుకునేలా పాలన జరుగుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేసారు. దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం లక్ష రూపాయలు ఎక్కువ, ఇది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలన గొప్పతనం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని, అతి తక్కువ కాలం లొనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, గుజరాత్ లో ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వకున్నా తెలంగాణలో ఇచ్చిన సత్తా ఉన్న నాయకుడు చంద్రశేఖర్ రావు అని కేటీఆర్ పేర్కొన్నారు.

బీజేపి ఎంపీలు పశువులు.. సోనియాకు భయపడమని,గుజరాత్ కు గులాంగిరి చేయమన్న కేటీఆర్

బీజేపి ఎంపీలు పశువులు.. సోనియాకు భయపడమని,గుజరాత్ కు గులాంగిరి చేయమన్న కేటీఆర్

ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు కడుపులో పేగులు తెగే దాకా కొట్లాడారని, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కొట్లాడకపోయినప్పటికి టీఆర్ఎస్ ఎంపీలను విమర్శిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్,బీజేపి ఎంపీలు మనుషులా పశువులా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ మూర్ఖంగా టీఆర్ఎస్ నేతలను బియ్యం స్మగ్లర్లు అంటున్నాడని, ఇలాగేనా రాజకీయాలు చేసేదని, తాము జవాబుదారీ తనంగా తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటామని తెలిపారు. ఢిల్లీ కి గుజరాత్ లకు గులాంలు కామని, సోనియా గాంధీకి మోడీ కి భయపడే వాడు ఇక్కడ ఎవ్వడూ లేడని కేటీఆర్ విరుచుకుపడ్డారు.

సచివాలయంలో నేల మాళిగలలు ఉంటాయా.? రేవంత్ ఓ అజ్ఞాని అన్న కేటీఆర్

సచివాలయంలో నేల మాళిగలలు ఉంటాయా.? రేవంత్ ఓ అజ్ఞాని అన్న కేటీఆర్

బీజేపి పార్టీకి మిగతా పార్టీల వాళ్ళు భపడుతుండొచ్చుగానీ టీఆర్ఎస్ పార్టీ అసలే భయపడదని అన్నారు కేటీఆర్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చీప్ గా మాట్లాడుతున్నాడని, సచివాలయంలో నేల మాళిగలు ఉన్నాయని పిచోడిలా మాట్లాడిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని ఎద్దేవా చేసారు. 50 కోట్ల రూపాయలు లంచమిచ్చి పీసీసీ తెచుకున్నాడని ఆ పార్టీ నేత కోమటి రెడ్డే ఆరోపించాడని తీవ్ర విమర్శలు చేసారు. ఒకడు బియ్యంలో 3 వేల కోట్ల స్కాం అంటాడని, మరొకడు వ్యాక్సిన్లలో 10 వేల కోట్ల స్కాం అంటాడని, ఏదీ పడితే అది మాట్లాడే వాడికి నెత్తి లేదు కత్తి లేదని ఎద్దేవా చేసారు మంత్రి కేటీఆర్.

బండి సంజయ్ తొండి సంజయ్ లా మారారు.. పియూష్ గోయల్ క్లాస్ పీకినా సిగ్గురాలేదన్న కేటీఆర్

బండి సంజయ్ తొండి సంజయ్ లా మారారు.. పియూష్ గోయల్ క్లాస్ పీకినా సిగ్గురాలేదన్న కేటీఆర్

ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కి క్లాస్ పీకినట్టు తమతో స్వయంగా చెప్పారని కేటీఆర్ వివరించారు. కేంద్రం తప్పిదాలే వల్లే ధాన్యం కొనుగోలు సమస్య ఉత్పన్నం అయ్యిందని, ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం చెప్పడం వల్లే సమస్యలు వచ్చాయని, ఏపీ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో కూడా ఉప్పుడు బియ్యం సమస్య ఉందన్న అంశం బండి సంజయ్ గ్రహించాలని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మద్దతు ఎందుకు ఇవ్వలేదని, ఒకరు ఢిల్లీకి గులాం ఐతే మరొకరు గుజరాత్ కు గులాం అయ్యారు కాబట్టే ఇవ్వలేదని ఘాటుగా విమర్శించారు కేటీఆర్.

బీజేపి తెలంగాణకు చేసిందేంటి.?ఎందుకు ఉద్యమకారులు బీజేపిలో చేరుతున్నారన్న కేటీఆర్

బీజేపి తెలంగాణకు చేసిందేంటి.?ఎందుకు ఉద్యమకారులు బీజేపిలో చేరుతున్నారన్న కేటీఆర్

తమకు మాత్రం తెలంగాణ ప్రజలే బాస్ లని, వారి కోసం ఎంతకైనా కొట్లాడుతామని, కేంద్రానిది దున్నపోతు మీద వాన పడ్డా స్పందన లేని వైఖరి అని మండిపడ్డారు. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు కానీ తెలంగాణ ప్రాజెక్టులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణకోసం ఎం చేసిందని ఉద్యమ కారులు ఆ పార్టీ లో చేరతున్నారని ప్రశ్నించారు. హిందూ ముస్లీం బాబర్ అక్బర్ తప్ప బీజేపీ కి ఏం తెలుసని ఎద్దేవా చేసారు. బీజేపీ ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ లేరని, అరెస్టులు చేస్తామని బెదిరిస్తే భయపడే వారు కూడా లేరని, ప్రజాక్షేత్రం లోనే తేల్చుకుంటామని కూటీఆర్ తెలిపారు.

నరసింహ రావుకు కాంగ్రెస్ పార్టీతో సుదీర్గ అనుబంధం.. ఇప్పుడు టీఆర్ఎస్ లోకి రావడం స్వాగతిస్తున్నానన్న కేటీఆర్

నరసింహ రావుకు కాంగ్రెస్ పార్టీతో సుదీర్గ అనుబంధం.. ఇప్పుడు టీఆర్ఎస్ లోకి రావడం స్వాగతిస్తున్నానన్న కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ తో రెండున్నర దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న లక్ష్మీ నరసింహ రావును టీఆర్ఎస్ లోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు స్పష్టం చేసారు. 15 సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహ రావు తనకు తెలుసని, ముక్కు సూటి వ్యక్తిత్వం గల మనిషని అన్నారు. 2006 లో చంద్రశేఖర్ రావు కరీంనగర్ ఉపఎన్నికల్లో గెలవ బోతున్నారని కాంగ్రెస్ లో ఉండి కూడా తనతో చెప్పారని కేటీఆర్ గుర్తు చేసారు. లక్ష్మీ నరసింహ రావు చేరికతో కరీంనగర్ లోపార్టీకి కొత్త శక్తి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

English summary
Minister KTR was incensed at the BJP and Congress parties. He said the BJP was the only party that had created chaos in the procurement of paddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X