Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ రెండు పోర్టల్స్ బంద్: నాగర్ కర్నూల్ సభలో జేపీ నడ్డా కామెంట్స్

మహబూబ్‌నగర్: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనేనని.. తమతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ నవసంకల్ప సభలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అలర్పించిన వారికి నివాళులర్పించారు జేపీ నడ్డా. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారన్నారు. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని జేపీ నడ్డా చెప్పారు.

JP Nadda

తెలంగాణలో మాత్రం అన్ని వర్గాల ప్రజలు దు:ఖంలో ఉన్నారని.. కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పోర్టల్, ధరణి పోర్టల్ బంద్ చేస్తామన్నారు. మోడీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకమయ్యాయన్నారు జేపీ నడ్డా. పాట్నాలో జరిగింది అవినీతి, కుల, కుటుంబ పార్టీల ఫొటో సెషన్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ అని పేరు మాత్రమే మార్చారని.. బీఆర్ఎస్ అంటే భ్రష్టచార రాక్షసుల సమితి అని దుయ్యబట్టారు.

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు మోడీ ప్రభుత్వం రూ. 4400 కోట్లు మంజూరు చేసిందన్నారు. తెంగాణ కోసం మెగా టెక్స్‌టైల్స్ పార్కును మోడీ ఇచ్చారన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్‌ను మోడీ ప్రారంభించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు మోడీ సర్కారు ఇచ్చిందన్నారు.

మోడీ ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు రేషన్ అందిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం పేదలకు అంకితమన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక పేదరికం 10 శాతానికి పడిపోయిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించారు. కమల వికాసంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు జేపీ నడ్డా.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తున్నామన్నారు. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిందన్నారు. అయినా, ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాల్లోనూ భారత్ దూసుకెళ్తోందన్నారు. మోడీని గ్లోబల్ లీడర్‌గా ప్రపంచమంతా కొనియాడుతోందన్నారు. మోడీ చేపట్టిన సంస్కరణలతో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా.. ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆనంద్ శంకర్ జయంత్ లతో సమావేశం అయ్యారు. అయితే, ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో సమావేశం చర్చనీయాంశంగా మారింది. భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇలాంటి చర్చలు జరగడం మంచిదేనని సమావేశం అనంతరం నాగేశ్వర్ మీడియాతో అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+