దేశ రాజధానిలో ఘనంగా తెలంగాణ బోనాలు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బోనాల పండుగ సంబురాలకు రాష్ట్ర ఎంపీలందరూ హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఈ కార్యక్రమానికి హాజరై బంగారు బోనమెత్తుకున్నారు.
కాంగ్రెస్ తరఫున పాల్వాయి గోవర్ధనరెడ్డి, రాపోలు ఆనందభాస్కర్‌లతో పాటు టిఆర్‌ఎస్‌కు చెందిన 11 మంది ఎంపీలు బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ తొలిసారిగా ఈ పండుగను అధికారికంగా గుర్తించడంతో పాటు హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజా మహంకాళీ ఆలయానికి బంగారు బోనాన్ని కానుకగా అందజేశారు. ఇప్పుడు ఈ కానుక ఢిల్లీలోని తెలంగాణ సదన్‌కు చేరుకుంది.
తెలంగాణ సదన్ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బోనాలు ఎత్తుకుని మహంకాళీ ఆలయ నిర్వాహకులు సదన్‌కు చేరుకున్నారు. అనంతరం సదన్‌లో ప్రతిష్టించి ఉత్సవాన్ని నిర్వహించారు.
ఇకపైన ఏటా బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు ఢిల్లీలో కూడా జరిగేలా ప్రయత్నిస్తామని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. సీమాంధ్రుల పాలనలో ఈ పండుగలకు తగిన ప్రాధాన్యం లభించలేదని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, జి నగేశ్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, బిబి పాటిల్, రాజ్యసభ ఎంపి కె కేశవరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ పాల్గొన్నారు.

ఢిల్లీలో బోనాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బోనాల పండుగ సంబురాలకు రాష్ట్ర ఎంపీలందరూ హాజరయ్యారు.

ఢిల్లీలో బోనాలు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఈ కార్యక్రమానికి హాజరై బంగారు బోనమెత్తుకున్నారు.

ఢిల్లీలో బోనాలు
కాంగ్రెస్ తరఫున పాల్వాయి గోవర్ధనరెడ్డి, రాపోలు ఆనందభాస్కర్‌లతో పాటు టిఆర్‌ఎస్‌కు చెందిన 11 మంది ఎంపీలు బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.

బోనాలు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ తొలిసారిగా ఈ పండుగను అధికారికంగా గుర్తించడంతో పాటు హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజా మహంకాళీ ఆలయానికి బంగారు బోనాన్ని కానుకగా అందజేశారు. ఇప్పుడు ఈ కానుక ఢిల్లీలోని తెలంగాణ సదన్‌కు చేరుకుంది.

ఢిల్లీలో బోనాలు
తెలంగాణ సదన్ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బోనాలు ఎత్తుకుని మహంకాళీ ఆలయ నిర్వాహకులు సదన్‌కు చేరుకున్నారు.

ఢిల్లీలో బోనాలు
అనంతరం సదన్‌లో ప్రతిష్టించి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు.

ఢిల్లీలో బోనాలు
ఎంపి బి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బోనాల కార్యక్రమం ముగిసినా పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు తెలంగాణ సదన్‌లో మరికొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

ఢిల్లీలో బోనాలు
ఢిల్లీలో ఉన్నందువల్ల హైదరాబాద్ ఉత్సవాలకు హాజరుకాలేకపోతున్నాననే అసంతృప్తిని ఈ కార్యక్రమం తొలగించిందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు.

ఢిల్లీలో బోనాలు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఈ కార్యక్రమానికి హాజరై బంగారు బోనమెత్తుకున్నారు.












Click it and Unblock the Notifications