పాత కక్షలు: బాలుడ్న్ని చంపేసి శవాన్ని పొలాల్లో పాతిపెట్టాడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం రావులపల్లి గ్రామంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పాతకక్షల కారణంగా ఆ గ్రామానికి చెందిన మహేందర్(17) అనే బాలుడ్ని హతమార్చి పొలాల్లో పాతిపెట్టాడు ఓ వ్యక్తి. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు నెలల తర్వాత ఆ బాలుడు శవమై తేలాడు.
అదే గ్రామానికి చెందిన లచ్చయ్య అనే వ్యక్తిపై బాలుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు లచ్చయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మహేందర్‌ను తానే చంపి పాతిపెట్టానని ఒప్పుకున్నాడు. అనంతరం పాతిపెట్టిన స్థలాన్ని చూపించడంతో పోలీసులు సోమవారం శవాన్ని వెలికితీయించారు.

నల్గొండ జిల్లాలో ఓ పత్తి రైతు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా చందంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన నేనావత్ బీల్యా అనే వ్యక్తి ఈ ఏడాది పత్తిపంటను సాగుచేశాడు. పంట సాగు కోసం తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు.
అయితే పంట దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం లేకపోవడం, అప్పులు తీర్చే దారి కనబడకపోవడంతో ఆయన తను సాగు చేసిన పత్తిచేలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications