పొన్నాలకు బీఆర్ఎస్ ఆఫర్ - ఆ స్థానం నుంచి బరిలో..!!

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల బీఆర్ఎస్ లో చేరటం ఖాయమైంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన పొన్నాలకు ఈ ఎన్నికల్లో జనగామ సీటు ఇవ్వకపోవటంతో ఆయన పార్టీని వీడారు. బీసీలకు పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమయంలనే నేరుగా పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నాలకు పార్టీలో ఇచ్చే ప్రాధాన్యతతో పాటుగా సీటు పైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ లోకి పొన్నాల : నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ లో పని చేసిన పొన్నాల ఆ పార్టీని వీడారు. పార్టీకి రాజీనామా చేస్తూ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాసారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రేవంత్ లక్ష్యంగా ఆరోపణలు సంధించారు. పార్టీలో సామాజిక న్యాయం అమలు కావటం లేదన్నారు. విల్లాలు ఇచ్చిన వారికే సీట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.

BRS Offier MP seat for Ponnala Lakshmaiah in next Elections, may contest in Bhongir Loksabha

పార్టీలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వాపోయారు. పార్టీని నమ్ముకున్న వారికి ఇదేనా జరిగే న్యాయం అని ప్రశ్నించారు. పార్టీ తన సేవలను గుర్తించకుండా..అవమానించిందని పొన్నాల ఉద్వేగానికి లోనయ్యారు. ఇదే సమయంలో పొన్నాల లేఖ పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

భువనగిరి ఎంపీగా ఛాన్స్ : దీంతో, పొన్నాల నివాసానికి కేటీఆర్ వెళ్లారు. సుదీర్ఘంగా మంతనాలు చేసారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నేరుగా కేసీఆర్ తో కలిసేందుకు సమయం ఖరారు చేసారు. కేసీఆర్ సమక్షంలో జనగాం ఎన్నికల సభలోనే గులాబీ కండువా కప్పుకొనేందుకు పొన్నాల సిద్దమయ్యారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ లో జనగాం సీటు పల్లాకు ఖరారు చేయటంతో పొన్నాలకు అసెంబ్లీ సీటు ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సుముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ సీటు పైనా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలని..లోక్ సభ ఎన్నికల్లో పొన్నాలను భువనగిరి లోక్ సభ నుంచి సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

BRS Offier MP seat for Ponnala Lakshmaiah in next Elections, may contest in Bhongir Loksabha

కేసీఆర్ తో సమావేశంలో నిర్ణయం : పొన్నాల నియోజకవర్గం జనగాం..భువనగిరి లోక్ సభ పరిధిలోకి వస్తంది. 2019 ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ కొంత కాలం క్రితం బీజేపీలో చేరారు. అక్కడ ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావటంతో అక్కడ నుంచి పొన్నాల ను బీఆర్ఎష్ అబ్యర్దిగా బరిలోకి దింపాలనేది ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది.

బీఆర్ఎస్ నుంచి ఆఫర్ రావటంతో..కేసీఆర్ తో సమావేశం సమయంలో పొన్నాల తన నిర్ణయాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది. దీని ద్వారా పొన్నాల ద్వారా కాంగ్రెస్ లో బీసీలకు గుర్తింపు లేదనే ప్రచారం చేయించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+