Railway news: రైల్వే ఉద్యోగులకు బంపర్ న్యూస్.. వారికి కోటి రూపాయలు!
రైల్వే ఉద్యోగులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రైల్వే ప్రగతి రథ చక్రాలైన రైల్వే సిబ్బంది, కార్మికుల కోసం రైల్వే భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ప్రయాణికులకే కాదు సంస్థలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేస్తుంది భారతీయ రైల్వే. ఈ క్రమంలో ఎస్బీఐ బ్యాంకుతో రైల్వే ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా రైల్వే తమ ఉద్యోగులకు గణనీయమైన బీమా ప్రయోజనాలను అందించనుంది.
భారతీయ రైల్వే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో భారతీయ రైల్వే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ఎస్బిఐలో శాలరీ ఖాతాలు కలిగిన రైల్వే ఉద్యోగులు ఇకపైన ఒక కోటి రూపాయల మేరకు ప్రమాద మరణ భీమా కవరేజ్ ని పొందనున్నారు. ఎస్బిఐ శాలరీ అకౌంట్ లు కలిగిన రైల్వే ఉద్యోగులు ఈ ఒప్పందం ద్వారా పదిలక్షల సహజ మరణ బీమాను పొందనున్నారు.

దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు బెనిఫిట్
ఎటువంటి ప్రీమియం చెల్లింపులు లేదా వైద్య పరీక్షలు లేకుండా ఈ బీమా రైల్వే ఉద్యోగులకు వర్తిస్తుంది. ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఎస్బిఐ ద్వారా జీతాలను చెల్లింపు చేస్తున్నారు. వీరందరికీ ఎస్బిఐ అందిస్తున్న ఈ బంపర్ ఆఫర్స్ వర్తిస్తాయి. ఇక ఇది మాత్రమే కాకుండా ఈ అవగాహన ఒప్పందంతో అదనంగా కొన్ని ప్రయోజనాలు కూడా రైల్వే ఉద్యోగులకు అందనున్నాయి.
శ్రామిక శక్తికి మద్దతుగా రైల్వే నిర్ణయం
వీటిలో 1.60 కోట్ల రూపాయల విమాన ప్రమాద మరణ కవరేజ్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఒప్పందం ముఖ్యంగా లోని ఫ్రంట్ లైన్ సిబ్బందికి తరచూ వృత్తిపరమైన ప్రమాదాలను ఎదుర్కొనే వారికి ప్రయోజనం చేకూర్చడం కోసం రూపొందించినదని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతీయ రైల్వేలకు వెన్నెముకగా ఉన్న శ్రామిక శక్తికి మద్దతునిచ్చేందుకే ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది












Click it and Unblock the Notifications