క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించి, దోపిడీ
హైదరాబాద్: భాగ్యనగరంలో వోలా క్యాబ్ డ్రైవర్ దోపిడీకి గురయ్యాడు. క్యాబ్‌ను బుక్ చేసుకున్న దుండగులు సూరారం వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ను బెదిరించి, అతడి వద్ద ఉన్న సొత్తును కాజేశారు. అనంతరం కారుతో సహా పరారయ్యారు. దుండగులు వనస్థలిపురం వద్ద క్యాబ్ బుక్ చేసుకున్నారు. సూరారం చేరుకోగానే డ్రైవర్‌ను బెదిరించి నగదు, సెల్ ఫోన్లు లాక్కొని పరారయ్యారు. పోలీసులు కారును ఆపే ప్రయత్నం చేశారు. కారు ప్రమాదానికి గురైంది. దీంతో నిందితులు కారును వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.


Click it and Unblock the Notifications