రేవంత్ సమర్ధతకు పరీక్ష - పట్టు నిలిచేనా..!!
తెలంగాణలో మరో ఎన్నికకు సర్వం సిద్దమైంది. పార్లమెంట్ ఎన్నికలు హోరా హోరీగా ముగిసాయి. ఈ నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కు ప్రచారం ముగిసింది. మొత్తం 52 మంది అభ్యర్దులు ఈ ఎన్నికలో పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్దులకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన రేవంత్ కు పీసీసీ చీఫ్ హోదాలోనూ ఉన్నారు. ఈ ఎన్నికలో గెలుపు రేవంత్ సమర్ధతకు పరీక్షగా నిలుస్తోంది.
ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు ప్రచారం ముగిసింది. మొత్తం నాలుగు లక్షల 63 వేల 839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. ఈ ఎన్నికలో 52 మంది అభ్యర్దులు తల పడుతున్నారు. ఈ నెల 27న పోలింగ్.. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.

గ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రచారం ముగియటంతో ఎన్నికల్లో గెలుపు కోసం మూడు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు అత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహిస్తూ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఈసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో... బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఆరుగురు మంత్రులను ప్రచారంలోకి దించింది. కాంగ్రెస్ అభ్యర్ది గెలుపు కోసం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవటం గులాబీ పార్టీకి అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా మారుతోంది. దీంతో..ఈ హోరా హోరీ పోరులో గెలుపు కోసం మూడు పార్టీలు తమ చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications