ఎల్వీ, బీపీ ఆచార్యలకు షాక్: విచారణకు కేంద్రం అనుమతి: ఏమిటీ ఎమ్మార్?

హైదరాబాద్: ఉమ్మడి ఏపీ సీఎంగా వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో జరిగిన ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కాం వ్యవహారంలో ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రమణ్యం, బీపీ ఆచార్యలను విచారించడానికి కేంద్రం ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఎమ్మార్ కుంభకోణంలో వందలాది కోట్ల అవినీతి జరిగిందని ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలోనే వీరిద్దరిని విచారించనున్నట్లు సీబీఐ పేర్కొంది. కాగా ప్రస్తుతం ఎల్వీ సుబ్రమణ్యం ఏపీ యువజన, క్రీడాశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండగా, బీపీ ఆచార్య తెలంగాణలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

అసలు ఏమిటీ ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం?

దుబాయ్‌‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ అనే కంపెనీ వైయస్ సీఎంగా ఉన్న హయాంలో హైదరాబాద్ మణికొండలో ఈ కంపెనీకి 531 ఎకరాల భూమిని కేటాయించారు. ఏపీఐఐసీ భాగస్వామ్యంతో ఈ కంపెనీ ఆ భూముల్లో విల్లాలు, హోటళ్లు, క్లబ్‌హౌస్‌, గోల్ఫ్‌కోర్సు, టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

Cbi ready to probe in emaar scam

అయితే ఈ వెంచర్‌లో ఏపీ వాటాను అప్పటి వైయస్ ప్రభుత్వం క్రమంగా తగ్గించి, ఎమ్మార్‌కు లబ్ధి చేకూర్చిందనేది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంలో లబ్ధిపొందిన వారు వైయస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆ సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం, బీపీ ఆచార్యలు ఏపీఐఐసీ చైర్మన్‌, ఎండీలుగా ఉన్నారు.

దీంతో ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై మాజీ మంత్రి శంకర్రావు రాసిన లేఖ ఆధారంగా సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎమ్మార్‌ ఒప్పందాలను నీరుకార్చడంలో ఎల్వీ, ఆచార్య కీలకపాత్ర వహించారని, ప్రతిఫలంగా విల్లాలను పొందారని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది.

అంతేకాదు విల్లాల ప్లాట్లఅమ్మకంలో రూ.1,347 కోట్లు, విల్లాల విక్రయంలో రూ. 1,256 కోట్లు, అపార్టుమెంట్ల విక్రయాల్లో రూ. 1,706 కోట్ల మేర ఏపీఐఐసీకి నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఐపీసీ 120బీ, 420, 477-ఏ, అవినీతి నిరోధక చట్టం 13(2), 13 (1) డీ కింద కేసులు నమోదు చేసింది.

Cbi ready to probe in emaar scam

ఈ నేపథ్యంలో ఎల్వీ సుబ్రమణ్యం, బీపీ ఆచార్యల సీబీఐ విచారణకు అనుమతించాలంటూ 2012 జనవరిలో కేంద్రాన్ని సీబీఐ కోరింది. అప్పుడు రెండసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అందుకుఅనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో జగన్‌ అక్రమాస్తుల కేసులో దాఖలు చేసిన చార్జిషీటులో వీరిద్దరి పేర్లనూ సీబీఐ చేర్చింది.

దీంతో సీబీఐ చార్జిషీటులో తమ పేర్లను చేర్చడంపై వారు అభ్యంతరపెట్టారు. ''కేంద్రం అనుమతి తీసుకోకుండా చార్జిషీటు ఎలా వేస్తారంటూ హైకోర్టులో సవాలు చేశారు. వీరి పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే, మోడీ సర్కారు స్పందించింది. ఎల్వీ సుబ్రమణ్యం, బీపీ ఆచార్యల విచారణకు తాజాగా సీబీఐకి అనుమతి ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+