జయలలితకు నేనంటే చాలా అభిమానం : టీటీడీపీ భేటీలో చంద్రబాబు
విజయవాడ : టీటీడీపీ నేతలతో భేటీ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా తమిళనాడు సీఎం జయలలిత గురించి ఆయన చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
భేటీ జరుగుతున్న సమయంలో.. జయలలిత గురించి ప్రస్తావించిన చంద్రబాబు 'జయలలితకు నేనంటే చాలా అభిమానం' అని చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న జయలలిత ఆరోగ్యంపై పలు రకాల వార్తలు వస్తుండడాన్ని చంద్రబాబు ప్రస్తావించారట. ఇక మోడీ గురించి ప్రస్తావిస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఆయన పొలిటికల్ ఇమేజ్ బాగా పెరిగిందని నేతలతో చెప్పారట చంద్రబాబు.

కాగా, తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలు, అనుసరించిన వ్యూహాలపై తాజా భేటీ జరిగింది. హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో.. పార్టీ సభ్యత్వ నమోదు, శిక్షణా తరగతులు, తాజా రాజకీయ పరిస్థితులపై తెలంగాణలో తెలుగుదేశం నేతలతో చంద్రబాబు చర్చించారు. ఇదే సమావేశంలో ముదిరాజ్ లను బీసీ-ఏ లో చేర్చే విషయమై చంద్రబాబుతో నేతలు చర్చించినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications