అన్యాయం చేస్తే మాత్రం: బిజెపితో బంధంపై టిఆర్ఎస్, బాబు డబుల్ గేమ్
న్యూఢిల్లీ: అంశాలవారీగా ఎన్డీయేతో తమ బంధం ఉంటుందని, తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి లోకసభ పక్ష నేత జితేందర్ రెడ్డి సోమవారం నాడు చెప్పారు. హైకోర్టు విభజన పైన కేంద్రం గత సమావేశాల్లోనే హామీ ఇచ్చిందని చెప్పారు.

హైకోర్టు విభజన కోసం సమావేశాల్లో నిరసన తెలుపుతామన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వవద్దని చెబుతామని, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జీవో వచ్చిందని చెప్పారు.
పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నారన్నారు. చంద్రబాబు డబుల్ గేమ్‌ను తాము కేంద్రమంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. భూసేకరణ బిల్లు విషయంలో రైతుల పక్షమే తమ విధానం అన్నారు.












Click it and Unblock the Notifications