RAT : ఎలుక కొరకడంతో చిన్నారి మృతి...
ఓ నలభై రోజుల చిన్నారి ముక్కును ఎలుక కొరకడంతో ఆ చిన్నారి మృతిచెందిన సంఘటన తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నాగనూల్ గ్రామంలో 40రోజుల చిన్నారి ముక్కును ఎలుక కొరికింది. దాంతో ఆ చిన్నారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావంతో ఆ చిన్నారి కన్నుమూశాడు. దీంతో నాగనూల్ గ్రామంలో విషాదం నెలకొంది.
నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగనూల్ గ్రామానికి చెందిన లక్ష్మీకళ, పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన శివ మూడు సంవత్సరాల క్రితం పెళ్లిచేసుకున్నారు. వీరికి ఈ మధ్యనే ఓ బాబు కూడా పుట్టాడు. ఆ బాబు పుట్టి 40 రోజులు. బాలింత కావడంతో లక్ష్మీకళ అప్పటి నుంచి తల్లి దగ్గరే ఉంటుంది. అయితే, రెండు రోజుల క్రితం ఆ బాబు నిద్రపోతున్న సమయంలో ఒక ఎలుక ఆ శిశువు ముక్కును కొరికింది. ఆ ఎలుక పదే పదే ఆ బాలుని ముక్కు కొరకడంతో తీవ్రంగా రక్తం కారింది. ఇది గమనించిన బాబు తల్లి, కుటుంబసభ్యులు నాగర్‌కర్నూలు జిల్లాలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుని పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో బాలుని కుటుంబసభ్యులు ఆ శిశువుని నిలోఫర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

మరికొద్ది రోజుల్లో తండ్రికి చెంతకు చేరాల్సిన బాలుడు మరణం : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు నిన్న రాత్రి మృతిచెందాడు. ఆ బాలుని మరణం కుటుంబంతో పాటు ఆ గ్రామాన్ని కూడా కలిచివేసింది. శిశువు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శిశువు పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినా ఈ ఘోరం జరుగుతుందని ఊహించలేదని ఆ బాలుని తాత వాపోయాడు. బాలుని మృతితో స్థానికంగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి చూట్టు ఉన్న పరిసరాలే ఎలుకల సంచారానికి కారణమని కుటుంబసభ్యులు అంటున్నారు. మరికొద్దిరోజుల్లో ఆ బాలున్నితండ్రి ఇంటికి వెళ్లాల్సి ఉండగా, అంతలోనే ఇంతటి ఘోరం జరిగిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications